గూఢచారి పాత్రలంటే మన హీరోలకు ఇష్టమే. స్టైల్, యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని రకాల జోనర్లనీ టచ్ చేయొచ్చు. చిరు ఎప్పుడో `చంటబ్బాయ్`లో జేమ్స్ పాండ్ గా కనిపించి నవ్వించేశాడు. మొన్నామధ్య `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` కూడా మెప్పించింది. మహేష్ బాబు ఎప్పటి నుంచో జేమ్స్ బాండ్ తరహా పాత్రల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.
ఇప్పుడు రవితేజకు ఆ ఛాన్స్ దక్కింది. రవితేజ కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రవితేజ పాత్ర జేమ్స్‌బాండ్ ని పోలి ఉంటుందట. రహస్య గూఢచారిగా మాస్ మహారాజా నవ్వులు పంచబోతున్నాడట. నక్కిన త్రినాథరావు కామెడీ టచ్ బాగా ఉన్న దర్శకుడు. తన మూడు సినిమాలన్నీ కామెడీ జోనర్ లో సాగేవే. ఈసారీ.. అలాంటి కథనే ఎంచుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ఇది చంటబ్బాయ్ కి కొత్త వెర్షన్ అనుకోవొచ్చు. మరి ఈసారి ఈ జేమ్స్ బాండ్ ఎన్ని నవ్వులు పంచుతాడో చూడాలి.