ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని మూవీలో స‌ముద్ర ఖ‌ని.

మరిన్ని వార్తలు

`డాన్‌శీను`, `బ‌లుపు` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొంద‌నుంది. లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ర‌వితేజ 66వ చిత్ర‌మిది. ర‌వితేజ ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు.

 

ద‌ర్శ‌క‌త్వం నుండి న‌ట‌న వైపు అడుగులేసి విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు తెచ్చుకుంటూ వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తున్న స‌ముద్ర‌ఖ‌ని ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. బ‌లుపు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మ‌రోసారి శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS