అనుష్క 'నిశ్శబ్ధం'కు కారణమదే!

మరిన్ని వార్తలు

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'నిశ్శబ్ధం'. ఈ రోజు అనుష్క పుట్టినరోజు సందర్భంగా 'నిశ్శబ్ధం' సినిమా టీజర్‌ని విడుదల చేశారు. టీజరే అయినా చిన్నపాటి ట్రైలర్‌ని తలపిస్తోంది. జాలీగా సాగిపోతున్న ఆ యువతి జీవితంలో చోటు చేసుకున్న అనుకోని సంఘటన ఆమె జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది.? అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. తమిళ హీరో మాధవన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో అనుష్క చెవిటి, మూగ అమ్మాయిగా కనిపిస్తోంది. సైగలతో తన ఎక్స్‌ప్రెషన్స్‌ తెలియచెప్పే ప్రయత్నం చేస్తోంది.

హారర్‌ అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌, హాలీవుడ్‌ మేకింగ్‌తో సినిమా నెక్స్‌ట్‌ లెవల్‌లో ఉండబోతోందనీ ఈ టీజర్‌ ద్వారా చెప్పకనే చెప్పేశారు. అమెరికాలోని సియాటెల్‌లో ఎక్కువ భాగం ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. అక్కడి లొకేషన్లు కొత్తగా కనిపిస్తున్నాయి. హేమంత్‌ మధుకర్‌ ఈ సినిమాకి దర్శకుడు. తెలుగు, తమిళ, హిందీ, తదితర నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదలవుతుండడం విశేషం. అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న స్వీటీకి స్వీట్‌గా విషెస్‌ చెప్పేద్దామా. విష్‌ యు హ్యాపీ బర్త్‌డే టు స్వీటీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS