ఆర్.ఎక్స్ 100తో ఒక్కసారిగా దుమ్మురేపింది పాయల్ రాజ్‌పుత్. ఆ సినిమాలో తన గ్లామర్, హాట్ సీన్లలో రెచ్చిపోయిన విధానం చూసి కుర్రకారంతా పాయల్‌కి ఫ్యాన్స్ అయిపోయారు. అవకాశాలు కూడా ఆ రకంగానే ఎగబడ్డాయి. పాయల్ చేతిలో చాలా సినిమాలున్నాయిప్పుడు. అందులో ఆర్.డి.ఎక్స్ లవ్ ఒకటి. ఆర్.ఎక్స్ 100 క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలన్న తాపత్రయం టైటిల్ తోనే చూపించేసుకున్నారు దర్శక నిర్మాతలు.
ఇటీవలే టీజర్ కూడా విడుదల చేశారు. ఆ టీజర్ మరింత హాటుగా, ఘాటుగా ఉంది. సెక్స్ కోసం తాపత్రయపడే అబ్బాయి, అమ్మాయిల కథలా కనిపిస్తోంది. కాస్త నిర్మొహమాటంగా చెప్పాలంటే ఈ సినిమా కాస్త బీ గ్రేడ్ మూవీలా కనిపిస్తోంది. ఓపక్క రవితేజ లాంటి హీరోల సినిమాల్లో నటిస్తూ, పాయల్ ఇలాంటి కథల్ని ఎందుకు ఎంచుకుంటోందో? ఈ సినిమా అటూ ఇటూ అయితే పాయల్ కెరీర్ ప్రమాదంలో పడిపోతుంది.
పాయల్ పై బూతు ముద్ర పడితే.. కమర్షియల్ సినిమాల్లో కథానాయికగా ఎంచుకోవడం కష్టం అవుతుంది. ఇక తనకు అవకాశాలు రావేమో అనుకున్నప్పుడు ఎలాంటి సినిమా ఒప్పుకున్నా జరిగే డామేజీ ఏం ఉండదు. కానీ ఎదుగుతున్న క్రమంలో ఇలాంటి సినిమాల్ని ఒప్పుకోవడం మాత్రం - కచ్చితంగా ప్లానింగ్‌లో లోపమే. ఆర్‌డిఎక్స్ తరవాత ఈ పాప భవిష్యత్తేమిటో చూడాలి.