'సాహో'లో విలన్‌గా నటించిన నీల్ నితిన్ ముఖేష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. గతంలోనూ పలు చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. తమిళ సూపర్ స్టార్ విజయ్ 'కత్తీ', బెల్లంకొండ 'కవచం' లోనూ ఈయనే విలన్. కాగా సోషల్ మీడియాలో నీల్ నితిన్ ముఖేష్‌పై ఓ వ్యక్తి అభ్యంతరకర ట్వీట్ చేశాడు. 'సాహో' రిలీజ్ తర్వాత ఈ ట్వీట్ బయటికి వచ్చింది.
ఇంతకీ ఏంటా ట్వీట్ అంటే, 'ఇది 2019, ఇంకా సినిమాల్లో నటిస్తున్నందుకు నీల్ నితిన్ ముఖేష్‌కి నిర్మాతలు ఎందుకు డబ్బులిస్తున్నారో నాకు సమాధానం కావాలి?' అంటూ ఆ వ్యక్తి ట్వీట్ చేశాడు. అసలు ఈ ట్వీట్ సారాంశం ఏంటో కానీ, దీనికి ధీటైన రిప్లైతో సమాధానమిచ్చాడు నీల్ నితిన్. ' ఈ ట్వీట్ చేసిన వ్యక్తి ఎవరో నాకు తెలీదు, తెలుసుకోవల్సిన అవసరం కూడా లేదు. నేను ఏ గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను.
ఇప్పటికీ కొనసాగుతున్నాను.. అలాంటిది ఎవరు నాపై ఇలాంటి ట్వీట్ చేశారో అర్ధం కావడం లేదు..' అంటూ ఆయన రిప్లై ఇచ్చారు. నీల్ సమాధానానికి మిగిలిన సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేశారు. అవును పనీ పాటా లేకుండా, కొందరు నెటిజన్లు ఇలాంటి ట్వీట్స్ చేస్తూ, అందరి దృష్టినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారిని పట్టించుకోవడమే వారికి పబ్లిసిటీ ఇచ్చినట్లవుతుంది. లైట్ తీసుకుంటే, వారు ఆశించిన పబ్లిసిటీ వారికి దక్కకుండా ఉంటుందనేది ఇంకొందరి సెలబ్రిటీల అభిప్రాయం.