బాలకృష్ణని నాగబాబు ఎందుకు టార్గెట్‌ చేస్తున్నాడు.?

మరిన్ని వార్తలు

ఏదో ఫన్‌ కోసం బాలయ్య ఎవరో తెలీదు అని ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చినందుకు నాగబాబుపై బాలయ్య ఫ్యాన్స్‌ రెచ్చిపోయారు. ఇలా ఒక్కసారి కాదు. చాలా సార్లే మెగాబ్రదర్‌ని బాలయ్య ఫ్యాన్స్‌ కెలికి కెలికి వదిలిపెట్టారు. దాంతో ఈ సారి నాగబాబు లైట్‌ తీసుకోలేదు. చెప్పి మరీ పోస్ట్‌లు పెట్టారు. 'నేను పెట్టిన పోస్ట్‌లు ఎలాగూ బాలయ్యకు ఆపాదించుకుని మీరు ఫీలవుతున్నారు కాబట్టి, అంటూ లేటెస్టుగా నాగబాబు కామెంట్‌ 1, కామెంట్‌ 2 అంటూ రెండు పోస్ట్‌లు వదిలారు.

 

అందులో ఒకటి - పవన్‌ కళ్యాణ్‌ ఎవరో తెలీదు అని గతంలో బాలయ్య అన్నదానికి కౌంటర్‌గా.. సినిమాల పరంగా పవన్‌ కళ్యాణ్‌ ఎవరో తెలియకపోవచ్చు. కానీ గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలవడానికి సాయం చేశాడు పవన్‌ కళ్యాణ్‌. అలాంటప్పుడు పవన్‌ కళ్యాణ్‌ అంటే తెలీదనడం కరెక్ట్‌ కాదు.? అని ప్రశ్నించాడు నాగబాబు. ఇక కామెంట్‌ నెం. 2 - మేమెవర్నీ హీరోల్ని చేయం. మాకు మేమే హీరోలం అన్నాడు ఒకప్పుడు బాలయ్య. 

 

అందుకు నాగబాబు కౌంటర్‌ హీరోల్ని చేయడానికి నీవెవరు, మహేష్‌, ఎన్టీఆర్‌, పవన్‌ కళ్యాణ్‌ ఇలా చాలా మంది స్టార్స్‌ ఉన్నారు. వీళ్లని స్టార్స్‌ చేయడానికి నువ్వెవరు. జనాలే వీళ్లని స్టార్స్‌ చేశారు.. అంటూ నాగబాబు కౌంటర్‌ ఇచ్చారు. మూడో కామెంట్‌ కోసం స్టే ట్యూన్‌డ్‌ అని వదిలిపెట్టాడు. నాగబాబు పెట్టే ఆ మూడో కామెంట్‌ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. స్టే ట్యూన్‌డ్‌ ఫర్‌ ది మెగాబ్రదర్ థార్డ్‌ కామెంట్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS