టాక్ ఆఫ్ ది వీక్‌: బాల‌య్య - నాగ‌బాబు దుమారం

By iQlikMovies - January 07, 2019 - 10:50 AM IST

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో ఎప్పుడూ ఏదో ఓ వివాదం న‌డుస్తుంటుంది. లేదంటే కిక్కే ఉండ‌దేమో. ప్ర‌స్తుతం అలాంటి వాతావ‌ర‌ణాన్ని మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు సృష్టిస్తున్నార‌నుకోవాలి. జ‌బ‌ర్ద‌స్త్ జ‌డ్జ్‌గా కూర్చుని న‌వ్వ‌డం, న‌వ్వించ‌డ‌మే కాదు.. ఇలా ఓ గంభీర‌మైన వాతావ‌ర‌ణాన్ని కూడా ఆయ‌న సృష్టించ‌గ‌ల‌ర‌ని 'బాల‌య్య ఎవ‌రో తెలీదు' ఎపిసోడ్‌తో తేలిపోయింది. ఓ ఇంట‌ర్వ్యూలో 'బాల‌య్య ఎవ‌రో తెలీదు' అని చెప్పి.. ఒక్క‌సారిగా టాలీవుడ్‌ని ఆక‌ర్షించారు నాగ‌బాబు.

 

ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్ల‌ని ఈ మెగా బ్ర‌ద‌ర్‌.. కావాల‌ని బాల‌య్య‌తో పెట్టుకుంటున్నాడేంటి? అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారంతా. నాగ‌బాబు అక్క‌డితో ఆగ‌లేదు. 'బాల‌య్య కంటే క‌మెడియ‌న్ బాల‌య్యే క‌దా...' అంటూ.. మ‌రోసారి కెలికారు. అప్ప‌టి నుంచీ.... ఆ కెలుకుడు కార్య‌క్ర‌మం భీక‌రంగా సాగుతూనే ఉంది. ఇప్పుడు 'అస‌లు అలా ఎందుకు అనాల్సివ‌చ్చింది' అంటూ... సుదీర్ఘంగా వివ‌ర‌ణ ఇచ్చుకుంటున్నారు.

 

'ఈరోజు ఉయ‌దం 9 గంట‌ల‌కు చూడండి.. రాత్రి 9కి చూడండి' అంటూ చాప్ట‌ర్ల ప్ర‌కారం వీడియోలు విడుద‌ల చేస్తూ... కొత్త సంచ‌ల‌నాల‌కు తెర లేపుతున్నారు. 'ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే ఎవ‌రో నాకు తెలీదు, మేమే స్టార్లు.. మేమెవ‌రినీ స్టార్ల‌ని చేయం' అంటూ బాల‌య్య చెప్పిన కామెంట్ల‌ను ఉద‌హ‌రిస్తూ ఓ రేంజ్‌లో విరుచుకుప‌డుతున్నాడు నాగ‌బాబు. ఇదంతా... మెగా - నంద‌మూరి ఫ్యాన్స్ మ‌ధ్య వేడి వేడి వాతార‌ణాన్ని సృష్టిస్తోంది.

 

ఇక ముందు నాగ‌బాబు ఇంకెన్ని వీడియోలు విడుద‌ల చేస్తారో అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ‌బాబు ఈ వీడియోల‌తో ఆగ‌లేదు. రానున్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌పైనా సెటైర్లు వేస్తున్నాడు. ‘కట్టు కథలు కొన్ని.. కల్పనలు ఇంకొన్ని.... చుట్టనేల.. మూట కట్టనేల... నిజం కక్కలేని బయోపిక్కులొద్దయా.. విశ్వదాభి రామ వినరా మామా...' అంటూ 'కవిత్వాలు చెప్పడం మాకూ వచ్చండోయ్..'  అంటూ కౌంట‌ర్లు ఇస్తున్నాడు. ఈ వివాదం ఎంత వ‌ర‌కూ వెళ్తుందో మ‌రి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS