ఆగస్టు 15న రావాల్సిన సాహో 30కి వాయిదా పడిందని వార్తలొచ్చాయి. వీటిపై ఇప్పుడు చిత్రబృందం కూడా క్లారిటీ ఇచ్చింది. సాహోని వాయిదా వేస్తున్నామని, ఆగస్టు 30నే విడుదల చేస్తున్నామని ఓ క్లారిటీ ఇచ్చింది. వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం అవ్వడం వల్లే - సాహో వాయిదా పడిందని ముందు నుంచీ తెలుస్తూనే ఉంది. ఇప్పుడు చిత్రబృందం కూడా అదే మాట చెప్పింది.
బాహుబలి తరవాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా ఇదని, నాణ్యత విషయంలో రాజీ పడకూడదన్న ఉద్దేశంతో ప్రతీ చిన్న విషయంపైనా ప్రత్యేక శ్రద్ధ వహించామని అందుకే సినిమా ఆలస్యం అవుతోందని చెప్పుకొచ్చారు దర్శక నిర్మాతలు. సినిమా కాస్త ఆలస్యమైనా ప్రభాస్ అభిమానులకు నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని, అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించామని, అభిమానుల్ని అందరినీ అలరించడం ఖాయమని భరోసా ఇచ్చింది సాహో టీమ్. మొత్తానికి సాహో వాయిదా విషయంపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఆగస్టు 30 వరకూ ఎదురుచూడడమే అభిమానుల పని.