త్రిష వెళ్లిపోవ‌డానికి పెద్ద రీజ‌నే ఉందే..?

మరిన్ని వార్తలు

చిరంజీవి 152వ చిత్రం నుంచి త్రిష అర్థాంత‌రంగా త‌ప్పుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. క్రియేటీవ్ డిఫ‌రెన్సెస్ అని - త్రిష‌ క‌ల‌రింగు ఇచ్చింది గానీ, దీని వెనుక పెద్ద కార‌ణ‌మే ఉందంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. ఈ సినిమా ఒప్పుకునే ముందు త్రిష చాలా ష‌ర‌తులు విధించింద‌ట‌. అవ‌న్నీ చిత్ర‌బృందం ఒప్పుకుంది. తీరా షూటింగ్ మొద‌ల‌య్యే స‌మ‌యానికి.. వాటిలో కొన్ని మిన‌హాయింపులు కోరింద‌ని తెలుస్తోంది. దాంతో త్రిష అలిగింద‌ని స‌మాచారం.

 

ఈ సినిమాలో మ‌రో క‌థానాయిక‌కీ చోటు ఉంది. ఆ పాత్రకోసం ఓ కుర్ర హీరోయిన్‌ని ఎంచుకోవాల‌ని చూస్తున్నారు. నిజానికి ఆ హీరోయిన్‌కి స్క్రిప్టు ద‌శ‌లో పెద్ద‌గా స్కోప్ లేదు. చివ‌రి నిమిషాల్లో ఆ పాత్ర ప్రాధాన్యం పెరిగింది. దాంతో త్రిష పాత్ర‌, లెంగ్తుపై ప్ర‌భావం ప‌డింది. రెండో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వ‌డం, స‌డ‌న్‌గా త‌న పాత్ర గ్రాఫ్ తగ్గ‌డంతో త్రిష ఫీలైంద‌ని తెలుస్తోంది. రెండో హీరోగా రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేష్ బాబు పేర్లు ప‌రిశీల‌న‌లోకి వచ్చాయి. వాళ్ల‌లో ఎవ‌రు ఫైన‌ల్ అయినా.. ఇదో మ‌ల్టీస్టార‌ర్ సినిమా అవుతుంది. సోలో హీరో సినిమాల్లో న‌టిస్తేనే క‌థానాయిక‌ల‌కు స‌రైన గుర్తింపు ద‌క్క‌డం లేదు. ఇక మ‌ల్టీస్టార‌ర్ అంటే ఇక అంతే సంగ‌తులు. అందుకే త్రిష మెల్ల‌గా ఈ సినిమా నుంచి త‌ప్పుకుంద‌ని టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS