ఆ నేరం ‘రౌడీ’దే అంటే ఎలా..?

మరిన్ని వార్తలు

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ నటించిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన రిజల్ట్‌ అందుకోలేకపోయింది. అయితే, ఆ సినిమాలో విజయ్‌ పోషించిన శీనయ్య పాత్రకు చాలా మంచి పేరొచ్చింది. ఏం లాభం. టోటల్‌గా సినిమా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోవడంతో, సినీ మేథావుంతా విజయ్‌ దేవరకొండని విమర్శించడం కొత్త పనిగా పెట్టుకున్నారు. పాపం విజయ్‌ దేవరకొండ ఏం చేస్తాడు.? సినిమాకి తాను చేయాల్సిందంతా చేశాడు. హీరోగా చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేశాడని చెప్పుకోవాలేమో కూడా. ప్రమోషన్స్‌ కోసం విజయ్‌ దేవరకొండ పడిన కష్టం అంతా ఇంతా కాదు. కానీ, ఆడియన్స్‌ నుండి ఆదరణ దక్కకపోతే నేరం ఆయనది కాదు కదా.

 

సినిమా హిట్‌ అవ్వాంటే, దాని వెనక ఎంతో మంది టెక్నీషియన్ల కృషి దాగి ఉంటుంది. హిట్‌ అయితే అందరికీ ప్రశంసలు దక్కుతాయి.ఇదిగో ఇలా.. ఫ్లాప్‌ అయ్యిందంటే నేరం ఎవరి మీద నెట్టాలా.? అని యోచిస్తుంటారు. ఎక్కువగా హీరోయిన్స్‌ బలైపోతుంటారు. కానీ, ఈ సారి పాపం రౌడీ బుక్కయిపోయాడు. రౌడీ తనకున్న ఇమేజ్‌తో ఈ మధ్య డైరెక్షన్‌ విభాగంలోనూ వేలు పెట్టేస్తున్నాడనీ, అందుకే వరుసగా సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నాయనీ కొత్తగా టాక్ వినిపిస్తోంది. కానీ, ఆ టాక్లో నిజం లేదనేది మరికొందరి వాదన. ఏది ఏమైతేనేం, తన మీద పడిన నిందను మాపుకోవాంటే, అర్జంట్‌గా రౌడీకి మంచి హిట్‌ పడాల్సిందే. అది పూరీ జగన్నాధ్‌ ‘ఫైటర్‌’ రూపంలోనే రావాలని ఆశిద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS