మహేష్‌బాబు తాజా చిత్రం 'మహర్షి' ఈ ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే తదుపరి సినిమాని లైన్‌లో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు మహేష్‌బాబు. ఆల్రెడీ సుకుమార్‌తో మహేష్‌బాబు సినిమా లైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కాంబో పట్టాలెక్కడానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉందట. కానీ అంతవరకూ మహేష్ రెస్ట్ తీసుకోవాలనుకోవడం లేదట.
త్వరలోనే తన తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాడట. సుకుమార్‌తో సినిమా అంటే ఈ ఏడాది రానట్లే. అలా కాక ఈ ఏడాది చివర్లోనే మహేష్ తన నుండి మరో సినిమాని అభిమానులకు గిఫ్ట్‌గా ఇచ్చేయాలనే యోచనలో ఉన్నాడట. అందుకే అనిల్ రావిపూడికి మహేష్ దాదాపు ఫిక్సయ్యాడని తాజాగా అందుతోన్న సమాచారమ్. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట.
ఆల్రెడీ స్క్రిప్టు పనుల్లో అనిల్ రావిపూడి బిజీ అయిపోయాడని తెలుస్తోంది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. అయితే దిల్‌రాజు సోలోగా కాకుండా, గతంలో మహేష్‌తో 'దూకుడు' తదితర చిత్రాలను రూపొందించిన అనిల్ సుంకరను నిర్మాణ భాగస్వామిగా తీసుకోనున్నారట. అనిల్ రావిపూడి సినిమా అంటే పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనరే నో డౌట్. అంతేకాదు ఇన్‌టైంలో సినిమాని పూర్తి చేసేస్తాడు ఇది పక్కా. అందుకే దాదాపు అనిల్‌కి మహేష్ ఫిక్సయిపోయాడని తెలుస్తోంది.