రకుల్‌కి మరో డిజాస్టర్‌.!

మరిన్ని వార్తలు

రకుల్‌ ప్రీత్‌సింగ్‌కి మళ్లీ నిరాశే మిగిలింది. 'దేవ్‌' సినిమాతో తెలుగులో మళ్లీ దున్నుకోవచ్చని భావించిన రకుల్‌ ప్రీత్‌సింగ్‌కి చుక్కెదురైంది. ఈ సినిమాని తెలుగులో అసలు ఎవ్వరూ పట్టించుకోలేదు. తెలుగులోనే కాదు, తమిళంలో కూడా ఆశించిన రిజల్ట్‌ అందుకోలేదనీ సమాచారమ్‌. సో రకుల్‌కి ఇక్కడా అక్కడా కూడా నిరాశే మిగిలింది. తెలుగులో కార్తికి పలానా మార్కెట్‌ అనే కన్నా, ఎంతో కొంత మంచి గుర్తింపే ఉంది. 

 

అయితే ఆ గుర్తింపుకు కూసింతైనా వాడుకోలేదు 'దేవ్‌' టీమ్‌. తెలుగులో అస్సలు ప్రచారమే చేయలేదు. ప్రమోషన్‌ లేకుండా సినిమాలు విజయం సాధించడం వల్లకాని పరిస్థితి. ఎలాంటి సినిమా అయినా పబ్లిసిటీ ఉంటే ఎంతో కొంత నెట్టుకొచ్చేస్తోంది. జస్ట్‌ ఓపెనింగ్స్‌తోనైనా ఓకే అనిపించుకుంటుంది. అయితే 'దేవ్‌' విషయంలో ఎందుకో ఆ అంశాన్ని అస్సలు పట్టించుకోలేదు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కూడా 'దేవ్‌'ని లైట్‌ తీసుకుంది. ఇప్పుడు సినిమా విడుదలై రిజల్ట్‌ వచ్చాక లబోదిబోమంటోంది. 

 

ఏం లాభం. అదేదో ముందుంటే బాగుండేది కదా అంటున్నారు రకుల్‌ ఫ్యాన్స్‌. ఇదిలా ఉంటే, ఈ వారం తెలుగులో స్ట్రెయిట్‌ సినిమాలేమీ లేవు. ఇలాంటి తరుణంలో కూడా రకుల్‌, కార్తీ సరైన ఓపెనింగ్స్‌ కూడా అందుకోలేకపోయారు. విడుదలైన రెండు సినిమాలూ డబ్బింగ్‌ సినిమాలే. వాటిలో 'లవర్స్‌డే'కి అంత సీను లేదని ముందే తేలిపోయింది. ఇక ఉన్నది 'దేవ్‌' మాత్రమే. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అయిన ఈ మూవీకి కూడా మంచి ఓపెనింగ్స్‌ రాకపోవడం సినీ ప్రియులకే అర్ధం కాని విషయం. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS