త్రిష, సిమ్రాన్‌ కాంబినేషన్‌లో మెగా మూవీ.!

మరిన్ని వార్తలు

తమిళ్‌లో హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌ ట్రెండ్‌ బాగా నడుస్తోంది. అందుకు కారణం నయనతార. హీరోలకు సమానంగా నయనతారపై బడ్జెట్‌ పెట్టి ఆమె ప్రధాన పాత్రలో సినిమాలు తెరకెక్కుతున్నాయ్‌ అక్కడ. అలాగే సూపర్‌ హిట్స్‌ అందుకుంటున్నాయ్‌ కూడా. ఇక ఆ వరుసలో సెకండ్‌ ప్లేస్‌లో ఉన్న ముద్దుగుమ్మ త్రిష. అయితే నయనతారలా త్రిషకు సక్సెస్‌లు మాత్రం అందడం లేదు. 

 

ఇప్పటికే పలు హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌తో ఆకట్టుకున్న త్రిష చేతిలో మరిన్ని బిగ్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక తాజాగా త్రిష చేతికి ఇలాంటిదే మరో ప్రాజెక్ట్‌ చిక్కింది. ఈ ప్రాజెక్టులో సిమ్రాన్‌ కూడా దాదాపు త్రిషకు ఈక్వెల్‌ రోల్‌లో నటించనుంది. ఇదో అడ్వెంచర్‌ మూవీ అట. సుమంత్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోందనీ తెలుస్తోంది. 

 

త్రిష, సిమ్రాన్‌లపై యాక్షన్‌ ఘట్టాల్ని విభిన్నంగా తీర్చిదిద్దనున్నారట. అంతేకాదు, ఈ సినిమా నిర్మాణంలో కూడా త్రిష, నయనతార భాగం పంచుకోనున్నారనీ సమాచారమ్‌. తమిళంతో పాటు, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఇకపోతే ఈ సంక్రాంతికి త్రిష, సిమ్రాన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో 'పేట' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS