'పిల్ల జమీందార్' ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'భాగమతి'. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా కథని అశోక్ 'బాహుబలి'కి ముందే అనుష్కకి చెప్పాడట. అయితే ఆ టైంలో అనుష్క వరస సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు, ప్రయోగాత్మక చిత్రం 'సైజ్ జీరో' కోసం అనుష్క చాలా లావెక్కింది. దాంతో ఈ సినిమా కోసం డైరెక్టర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. అలా అనేక కారణాలతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు అనుష్క తన ఫిజిక్‌ని 'భాగమతి' క్యారెక్టర్ కోసం తగిన విధంగా మలచుకుంది. దాంతో సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. సినిమా కోసం అనుష్క చూపించే డెడికేషన్ ఇప్పటి హీరోయిన్స్‌లో ఎవ్వరికీ లేదనే చెప్పాలి. ఆ డెడికేషనే అనుష్కని హీరోయిన్గా ఈ స్థాయిలో నిలబెట్టింది. తొలుత గ్లామరస్ పాత్రలకే పరిమితమైన అనుష్క హీరోయిన్ ప్రాధాన్యత గల సినిమాలకు మొదటి ఆప్షన్ అయ్యిందంటే ఆమెలోని ఆ డెడికేషనే కారణం. అందుకే అనుష్క అందరికీ స్వీటీ అయ్యింది. ఆమె నుండి అన్ని ప్రయోగాత్మక చిత్రాలు వచ్చాయి. కాగా నానితో 'పిల్ల జమీందార్' సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ అశోక్‌కి దర్శకుడిగా ఇదో ప్రెస్టీజియస్ మూవీ కానుందరటున్నాడు. కూల్ ఎంటర్టైనర్ 'పిల్ల జమీందార్'. అలాగే యూత్‌కి కనెక్ట్ అయ్యే మంచి మెసేజ్‌ని కూల్‌గా ఇచ్చి సక్సెస్ అయ్యాడు ఆ సినిమాతో. కానీ ఇదో డిఫరెంట్ జోనర్ మూవీ. ఈ సినిమాతో డైరెక్టర్‌గా తానేంటో ప్రూవ్ చేసుకోవాలంటున్నాడు అశోక్. అలాగే ఈ సినిమాలో అనుష్కది డబుల్ రోల్ అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ అది నిజం కాదని ఖండించాడు డైరెక్టర్ అశోక్. అనుష్క బర్త్‌డే సందర్భంగా రిలీజైన ఫస్ట్‌లుక్ ఇంట్రెస్టింగ్గా ఉంది.