మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ నెంబర్ 150' థాంక్స్ మీట్‌ని ఘనంగా నిర్వహించాలనుకుంది చిత్ర యూనిట్. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్లేస్ దొరక్క, పర్మిషన్ దొరక్క చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే మళ్లీ థాంక్స్ మీట్ అంటే ఇంకెన్ని ఇబ్బందులు కల్గుతాయో అని భావిస్తున్నారట. అయితే చిరంజీవి నెక్స్ట్ మూవీ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఉండబోతోందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ రోజే 'ఖైదీ' సినిమా థాంక్స్ మీట్ కూడా ఉండబోతోందట. ఈ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేద్దామనుకుంటున్నారట. ప్రస్తుతం చిరంజీవి బుల్లితెరపై సందడి చేస్తున్నారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాం ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి. అలాగే ఖైదీ సినిమా సక్సెస్‌ని కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చేయబోతున్న సినిమాని పట్టాలెక్కించే యోచనలో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి కూడా రామ్ చరణే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ముద్దుగుమ్మ అనుష్క హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అంతేకాదు చిరంజీవి లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన 'ఖైదీ' సినిమాలోనే డాన్సులు ఇరగదీసేశారు. ఇప్పుడు రాబోతున్న కొత్త సినిమాలో డాన్సులతో మరింత ఊపేయనున్నారట. అదిరిపోయే స్టెప్పులేయనున్నారట. ఎంటర్టైన్మెంట్తో పాటు, ఓ మంచి మెసేజ్ కూడా ఈ సినిమా ద్వారా ఇచ్చేందుకు సురేందర్ రెడ్డి స్టోరీ ప్రిపేర్ చేస్తున్నాడనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్.