'సామి 2' సినిమాలో త్రిష ఒక హీరోయిన్ కాగా, కీర్తి సురేష్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే కొన్ని కారణాలతో త్రిష ఈ సినిమా నుండి తప్పుకుంది. ఈ సినిమా నుండి తప్పుకున్నాననీ ఇదివరకూ త్రిష ప్రకటించింది. చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పి, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ చెబుతూ, ఈ సినిమాకి టాటా బైబై చెప్పేసింది.
అలా చేయడంతో వివాదం లేకుండా ఈ సినిమా నుండి బయటపడ్డానని భావించిన త్రిషకు ఇప్పుడు చుక్కెదురైంది. సినిమా నుండి తప్పుకున్నందుకు త్రిషపై సినిమా నిర్మాత శిబు థమియన్స్ నడిగర్ సంఘానికి ఫిర్యాదు చేశాడు. ఈ సినిమా నుండి త్రిష తప్పుకోవడంతో తాము చాలా నష్టపోయామనీ శిబు థమియన్స్ ఆరోపించారు. ముందస్తు సమాచారం లేకుండా సైన్ చేసిన సినిమా నుండి తప్పుకోవడం ఓ సీనియర్ హీరోయిన్‌గా త్రిషకు తగదనీ ఆయన అన్నారు.
హరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'సామి 2'. విక్రమ్ హీరోగా 2003లో వచ్చిన 'సామి' సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న సినిమానే 'సామి 2'. అప్పట్లో ఘన విజయం సాధించింది ఈ సినిమా. ఒరిజినల్‌లో త్రిష హీరోయిన్‌గా నటించింది. సీక్వెల్‌కి వచ్చేసరికి ఇద్దరు హీరోయిన్లను ఎంచుకుంది చిత్ర యూనిట్.
అయితే హీరోయిన్స్ ఇద్దరి మధ్యా ఆధిపత్య పోరు కారణంగానే త్రిష ఈ సినిమా నుండి తప్పుకుందనీ ఓ గాసిప్ ప్రచారంలో ఉంది. త్రిష క్యారెక్టర్‌లో కోత పెట్టి, ముందు అనుకున్నదాని కన్నా కీర్తి సురేష్ క్యారెక్టర్‌ని కాస్త పెంచాడట డైరెక్టర్. దాంతో తన క్యారెక్టర్ ఇంపార్టెన్స్ తగ్గిపోవడంతోనే ఈ సినిమా నుండి త్రిష తప్పుకుందనీ కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.