ధృవ హిట్‌తో ఫామ్ లోకి వచ్చేశాడు రామ్ చరణ్. ఇప్పుడు తన ఫోకస్ అంతా.. సుకుమార్ సినిమాపై పెట్టాడు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత నాయిక. ఇటీవలే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఫిబ్రవరి రెండో వారంలో సెట్స్‌పైకి వెళ్తుందని చెప్పుకొన్నారు. అయితే ఇంత వరకూ షూటింగ్ మొదలెట్టలేదు. దానికి కారణం.. షూటింగ్ లొకేషన్లని ఆఖరి నిమిషంలో మార్చడమే అనితెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని పల్లెటూర్లలో ఈ సినిమా షూటింగ్ జరపాలని చిత్రబృందం భావించింది. ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకొంది. పొలాచ్చీలో షూటింగ్ మొదలెట్టాలని, అక్కడే ఈ సినిమా షూటింగ్‌కి అనుకూలమైన వాతావరణం ఉందని చిత్రబృందం భావించింది. అందుకే.. లొకేషన్ అక్కడికి షిఫ్ట్ అయ్యింది. అందుకే... ఈ సినిమా ఆలస్యం అయ్యిందని, మార్చి మొదటి వారంలో క్లాప్ కొట్టడం ఖాయమని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలలో మరో నాయిక స్థానం రాశీఖన్నాకు దక్కినట్టు ప్రచారం సాగుతోంది.