ఎన్టీఆర్ ఈసారి ప్రయోగాత్మక పాత్రలో కనిపించనున్నాడా? తన గెటప్ పూర్తిగా మార్చుకొని అభిమానులకు స్వీట్ షాక్ ఇవ్వబోతున్నాడా?? పరిస్థితులు చూస్తుంటే అలానే ఉన్నాయి. ఎన్టీఆర్ - బాబీ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడన్న వార్తే ఓ సంచలనం. అందులోనూ ఓ పాత్ర పూర్తిగా నెటిటీవ్ టచ్‌తో సాగుతుంది తెలియడం మరో షాక్. ఈ సినిమా కోసమే హాలీవుడ్ మేకప్‌మెన్ హార్డ్వెల్ని భారీ పారితోషికం ఇచ్చి మరీ దిగుమతి చేసుకొన్నారు. అతని పర్యవేక్షణలో ఎన్టీఆర్‌కి ప్రస్తుతం మేకప్ టెస్ట్‌లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అందులో ఓ గెటప్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయిందట. ఆ గెటప్‌లో ఎన్టీఆర్‌ని చూస్తే.. గుర్తుపట్టడం చాలా కష్టమట. కేవలం మేకప్ కోసమే ఐదు గంటలు కేటాయించాల్సివస్తుందట. ఇప్పుడు ఎన్టీఆర్ తన హెయిర్‌స్టైల్‌ని కూడా మార్చుకోబోతున్నాడని తెలుస్తోంది. త్వరలో దుబాయ్ వెళ్లి.. అక్కడ హెయిర్ స్టైలీష్ నిపుణుడి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కేశాలంకరణని మార్చుకోబోతున్నాడని తెలుస్తోంది. రాఖీఖన్నా కథానాయికగా ఎంపికైన ఈ చిత్రం కోసం మరో ఇద్దరు కథానాయికల కోసం అన్వేషణ సాగుతోంది.