2019 రీక్యాప్‌: గాసిప్పులు

మరిన్ని వార్తలు

అసలు గాసిప్పు అనే మాట పుట్టిందే సినిమా పరిశ్రమ కోసం. ఈ కలర్ ఫుల్ ప్రపంచంపై అందరికీ ఓ కన్ను వుంటుంది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే కుతూహలం. ఈ ఏడాది చోటు చేసుకున్న గాసిప్పులపై ఓ లుక్ వేస్తె..

 

రానాకి ఏమైయింది ?

 

ఈ ఏడాది రానా సినిమాలు చేయలేదు కానీ.. ఆయన ఆరోగ్యంపై చాలా గాసిప్పులు వచ్చాయి. రానా కిడ్నీల సమస్యతో బాధపడుతున్నాడనేది ఈ గాసిప్పుల సారాంశం. చాన్నాళ్లు మందుల మీద నెట్టుకువచ్చాడని, అయితే కిడ్నీల మార్పిడి తప్పనిసరైయిందని, అందుకే ఇప్పుడు అమెరికా వెళ్లాడని, అక్కడ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేస్తారని, దగ్గుబాటి కుటుంబసభ్యులంతా అమెరికాలో వుండి వచ్చారని కధనాలు వినిపించాయి. ఇప్పుడు రానాని చూస్తే చాలా మార్పులు వచ్చాయి. మరీ పుల్లలా కనిపిస్తున్నాడు. ఏదో జరిగింది. సురేష్ బాబు దీనిపై క్లారిటీ ఇవ్వలేదు కానీ.. చిన్న సర్జరీ జరిగిందని మాత్రం చెప్పారు.

 

పున‌ర్నవి, రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ లవ్

 

పెరుగన్నం లేకుండ భోజనం పూర్తవుతుందేమో కానీ లవ్ ట్రాక్ లేకుండ బిగ్ బాస్ షో మాత్రం పూర్తి కాదు. ఈ ఏడాది కూడా బిగ్ హౌస్ లో ఓ జంట జనాలని ఆకర్షించింది. పున‌ర్నవి, రాహుల్ సిప్లిగంజ్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ నడిచింది. హౌస్ లో వుండగా అల్లుకుపోయింది ఈ జంట. అది షో కోసమే ఏమో కానీ వాళ్ళ కెమిస్ట్రీ చూసిన జనాలు మాత్రం వీళ్ళ మధ్య ప్రేమ బుల్లెట్ ట్రైన్ లా పరిగెడుతుందని భావించారు. అయితే ఈ బిగ్ బాస్ బంధాలన్నీ పులిహోర బంధాలు. అందులో పులి లేకపోవడం ఎంత నిజమో.. ఆ హౌస్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళ బంధాల్లో ఎమోషన్ లేకపోవడమూ అంతే నిజం. షో నుండి బయటికి వచ్చిన తర్వాత.. పున‌ర్నవి, రాహుల్ తనకి మంచి ఫ్రండ్ అనేసింది. రాహుల్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఆ సీజన్ అలా ముగిసిపోయింది.

 

బీజేపీలో కి చిరు ? :

 

చిరంజీవి పాలిటిక్స్ కి దూరం అయ్యారు. టెక్నికల్ గా మాత్రం ఆయన కాంగ్రెస్ లో వున్నట్లు లెక్క. ఆ పార్టీలో చేరిన తర్వాత రాజీనామా చేయలేదు. సినిమాలు చేసుకుంటున్నారు. ఈ ఏడాది సైరా చేశారు. ఈ సినిమా ప్రమోషన్‌లో కేంద్ర పెద్దలని కలిశారు. ఢిల్లీ వెళ్లారు. సైరాను వీక్షించాలని ప్రధాని మోడీ సహా కేంద్ర పెద్దలను కోరనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌‌తో మీటింగ్ పెట్టారు. దీంతో ఆయన బిజెపి వైపు చూస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమో జరగలేదు. ఇంక ఆ రాజకీయ రొచ్చు తనకి అవసరం లేదని కామ్ అయిపోయారు మెగాస్టార్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS