సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరో సంచలనానికి తెర లేపాడు. విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్' టీజర్ విడుదలైంది. విడుదలైన కాస్సేపటి నుండే వ్యూస్ పోటెత్తుతున్నాయి. ఒక నిముషం 8 సెకన్లపాటున్న ఈ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రికార్డు దిశగా వ్యూస్ పరుగులు పెడుతున్నాయి. యాక్షన్ పంచ్‌తో స్టార్ట్ అయిన టీజర్ డీప్ లిప్‌లాక్‌తో ఎండ్ అయింది.
భరత్ కమ్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని మైత్రీ మూవీస్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఇంతవరకూ తెలంగాణా యాసతో అసలు సిసలు తెలంగాణా కుర్రోడిగా ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఆంధ్రా కుర్రోడుగా, అచ్చమైన గోదారి జిల్లా కుర్రోడిగా అలరించనున్నాడు డియర్ కామ్రేడ్‌లో. హిట్ పెయిర్ రష్మికా మండన్నాతో విజయ్ మరోసారి జత కడుతున్నాడీ సినిమాలో.
విజయ్ దేవరకొండకున్న క్రేజ్‌తో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. టీజర్ వచ్చాక ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. యూట్యూబ్‌లో వ్యూస్ పోటెత్తుతున్న వైనం చూస్తుంటే, ఈ సినిమాతో మరోసారి విజయ్ దేవరకొండని విజయం వరించడం ఖాయమనిపిస్తోంది. భారీ అంచనాల నడుమ మన విజయ్ దేవరకొండ ఇప్పుడు కామ్రేడ్ దేవరకొండగా మే 31న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.