118తో దర్శకుడిగా మారారు ఛాయాగ్రహకుడు గుహన్. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలసి పనిచేయబోతున్నారు. ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ ప్రకటించారు కూడా. "గుహన్తో మరోసారి పనిచేయాలనివుంది. త్వరలో మా కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుంది" అని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. `118`కి సీక్వెల్ చేయాలని గుహన్ ఆలోచన. ఈ సినిమాకి కొనసాగింపు ఉంటుందని గుహన్ ఇది వరకే చెప్పారు.
అయితే... ఈసారి మాత్రం కళ్యాణ్ రామ్ తో కొత్త కథ చేయబోతున్నారట. ఇది కూడా ఓ వినూత్నమైన కథాంశంతో తెరకెక్కనున్నదని సమాచారం. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేతిలో మూడు సినిమాలున్నాయి. త్వరలో ఓ చిత్రం పట్టాలెక్కబోతోంది. 2020లో గుహన్తో సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఈలోగా గుహన్ మరో సినిమా చేస్తారా? లేదంటే అప్పటి వరకూ కళ్యాణ్ రామ్ కోసం ఎదురుచూస్తారా? అనేది తేలాల్సివుంది.