ఆకాశ‌మంత ఎత్తుకు ఎదిగిన పాట‌

By Gowthami - April 06, 2020 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

ఈమ‌ధ్య పెద్ద సినిమాల్లో కంటే చిన్న సినిమాల్లోనే మంచి పాట‌లు వినిపిస్తున్నాయి క‌నిపిస్తున్నాయ్‌. యాధృచ్ఛిక‌మో ఏమో గానీ, హిట్ అయిన పాట‌ల‌న్నీ దాదాపుగా సిద్ద్ శ్రీ‌రామ్ గ‌ళం నుంచి ప‌లికిన‌వే. `30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా` అనే సినిమాలోనూ సిద్ద్ శ్రీ‌రామ్ పాట మాయ చేసింది. నీలీ నీలీ ఆకాశం ఇద్దామ‌నుకున్నా అంటూ సిద్ద్ శ్రీ‌రామ్ పాడిన పాట‌.. నెట్టింట్లో బాగా వినిపించింది. యాంక‌ర్ ప్ర‌దీప్ హీరోగా అవ‌తారం ఎత్తిన సినిమా ఇదే. ప్ర‌చారంలో భాగంగా విడుద‌ల చేసిన ఈ తొలి గీతానికి అపూర్వ స్పంద‌న ల‌భించింది.

 

ఈ ఒక్క పాట కోస‌మే సినిమా చూసేంత ఇష్టం ఏర్ప‌డింది. చిరు వాన‌లా మొద‌లై, సునామీలా విరుచుకుప‌డిపోయిన ఈ పాట‌. ఇప్పుడు వంద మిలియ‌న్ల వ్యూస్‌కి చేరుకుంది. ఓ చిన్న సినిమాలోని పాట‌, అందులోనూ ప్ర‌దీప్ లాంటి కొత్త కుర్రాడి సినిమాలోని పాట‌కు ఈ స్థాయిలో హిట్స్ ల‌భించ‌డం మామూలు విష‌యం కాదు. లాక్ డౌన్ వ‌ల్ల కుద‌ర్లేదు గానీ, ఈపాట‌కి ఈ సినిమా విడుద‌ల‌య్యేది కూడా. చిత్ర‌బృందం కొత్త రిలీజ్ డేట్‌ని త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌బోతోంది. ఏదేమైనా.. చిన్న సినిమాకి కోట్ల విలువ గ‌ల ప‌బ్లిసిటీ అందించిన ఈ పాట‌కు 'వంద'నాలు చెల్లించుకోవాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS