తేజు కోసం రెజీనా మళ్లీ వస్తుందా.?

మరిన్ని వార్తలు

వరుస ఫెయిల్యూర్స్‌ తర్వాత 'చిత్రలహరి'తో సూపర్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ తదుపరి మారుతి డైరెక్షన్‌లో సినిమాకి కమిట్‌ అయ్యాడు. 'శైలజారెడ్డి అల్లుడు'తో మారుతి సక్సెస్‌కి బ్రేకులు పడ్డాయి. మళ్లీ తేజు సినిమాతో బౌన్స్‌ బ్యాక్‌ అయ్యేందుకు తగ్గట్లుగా స్క్రిప్టు ప్రిపేర్‌ చేసుకున్నాడు మారుతి. ఈ సినిమా కోసం తేజు ఒళ్లు తగ్గించే పనిలో బిజీగా ఉన్నాడట. కాన్సెప్ట్‌కి తగ్గట్టుగా హీరో సిక్స్‌ ప్యాక్‌తో కనిపించాల్సి ఉందనీ, సో తేజుని మారుతి ఒళ్లు తగ్గాలని సూచించడంతో ఆ పనిలో బిజీగా ఉన్నాడట తేజు.

 

ఇప్పటికే రెగ్యులర్‌ వర్కవుట్స్‌తో చాలా వరకూ బరువు తగ్గాడట. తేజు మేకోవర్‌ కంప్లీట్‌ కాగానే ఈ సినిమాని పట్టాలెక్కించనున్నాడు మారుతి. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో అందాల భామ రెజీనా నటించబోతోందంటూ గాసిప్‌ ఒకటి చక్కర్లు కొడుతోంది. రెజీనా - తేజు బెస్ట్‌ కాంబినేషన్‌. గతంలో 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' సినిమాల్లో ఈ ఇద్దరూ నటించారు. ఈ రెండూ తేజు కెరీర్‌లో సూపర్‌ హిట్‌ సినిమాలే.

 

సో ఓ వైపు సెంటిమెంట్‌ వర్కవుటవుతుంది, మరోవైపు క్యారెక్టర్‌ పరంగా రెజీనా అయితే బావుంటుందని చిత్రయూనిట్‌ యోచిస్తోందట. దాంతో రెజీనాని ఈ సినిమా కోసం తీసుకున్నారట. అయితే రెజీనా ఈ సినిమాలో పూర్తి స్థాయిలో కనిపించదట. నిడివి తక్కువ ఉన్న పాత్రట. అయితే, సినిమాని టర్న్‌ చేసే గెస్ట్‌ రోల్‌ అని తెలుస్తోంది. చూడాలి మరి రెజీనా లక్‌ మరోసారి తేజుకి కలిసొస్తుందేమో. ప్రస్తుతం రెజీనా బాలీవుడ్‌లో బిజీగా గడుపుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS