ఎప్పుడో విడుదల కావల్సిన 'అర్జున్ సురవరం' సినిమా వన్ ఫైన్ డే అంటూ మే డే రోజు అంటే మే 1న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే అనూహ్యంగా వచ్చిన ఆంగ్ల మూవీ హైప్ వంక పెట్టి, నిఖిల్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు వాయిదా వేశారు. ఆ వాయిదా వాయిదాగానే మిగిలిపోయింది. గత వారం అంటే మే 17న 'అర్జున్ సురవరం' రిలీజ్ అవుతుందనుకున్నారు కానీ, సినిమాకి సంబంధించి ఏ హడావిడి చేయకపోవడంతో అసలు అర్జున్ సురవరం రిలీజ్ ఉందో లేదో కూడా ఆ రోజు వరకూ తెలియని పరిస్థితి అయిపోయింది అభిమానులకు.
చివరికి మే 17 డేట్‌ని మిస్ చేసుకుంది అర్జున్ సురవరం. ఇక ఈ నెలలో మిగిలింది 24 డేట్. కానీ ఈ డేట్‌ని 'సీత' నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ అన్నట్లుగా సోలోగా ప్లేస్ ఆక్యుపై చేసేసింది. సో 'అర్జున్ సురవరం' ఎప్పుడొచ్చేది.? అభిమానుల్లో మెదులుతున్న అనుమానమిదే. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిఖిల్ కూడా డల్ అయిపోయాడు. మేడే రిలీజ్ పోస్ట్‌పోన్ నిఖిల్‌ని బాగా బాధించింది.
ఆ వేడిలో తన బాధను వెల్లిబుచ్చుకోవడానికి స్టేట్‌మెంట్ ఇచ్చాడు తప్ప, మళ్లీ సినిమా రిలీజ్‌పై నిఖిల్ కూడా స్పందించింది లేదు. తన సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో అనే డైలమా ఫ్యాన్స్‌నే కాదు, నిఖిల్‌ని కూడా వెంటాడుతోందట. చక్కని థీమ్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెర వెనుక ఎవరో అడ్డుకుంటున్నారనీ ఆ నోటా, ఈ నోటా అందుతోన్న సమాచారమ్. కావాలనే నిఖిల్‌ని తొక్కేయడానికే ఇలా జరుగుతోందట. అసలు తెర వెనక ఏం జరుగుతోంది.? తెలియాలంటే, నిఖిల్ కానీ, చిత్ర యూనిట్ కానీ స్పందించి తీరాలి.