బాలీవుడ్‌లో కొంచెం జాగ్రత్త రెజీనా!

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్స్‌గా వెలుగొందిన ముద్దుగుమ్మలకు బాలీవుడ్‌లో చుక్కెదురవుతూనే ఉంది. కానీ మన ముద్దుగుమ్మలు ఇదేం పట్టించుకోకుండా, ఎప్పటికప్పుడే బాలీవుడ్‌పై మోజుతో చిత్తు చిత్తవుతూనే ఉన్నారు. మన టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ వచ్చాక, ఆ స్టార్‌డమ్‌ని వదిలేసుకుని బాలీవుడ్‌కి వెళ్లిన అందాల భామల లిస్టు పెద్దదే ఉంది. 

స్టార్‌ హీరోలందరి సరసన నటించేసి టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ అనిపించుకున్న ఇలియాన బాలీవుడ్‌కెళ్లింది. అక్కడ అమ్మడి పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అయితే వెనక్కి తిరిగి రావడానికి ఇలియానాకి అవకాశం లేక, అరా కొరా అవకాశాలతో అక్కడే పాతుకుపోయింది. ఇక కాజల్‌ అగర్వాల్‌ కూడా బాలీవుడ్‌ టేస్ట్‌ని చవి చూసి, వెనక్కి తిరిగి వచ్చిందే, త్రిష కూడా అంతే, టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ వచ్చినాకే బాలీవుడ్‌కి వెళ్లి చేతులు కాల్చుకుంది. ఇటీవలే హాట్‌ హాట్‌ అందాల సుందరి లక్ష్మీరాయ్‌ బాలీవుడ్‌ ఛాన్స్‌ రావడంతో ఎగిరి గంతేసింది. కానీ తీరా చూస్తే, బాలీవుడ్‌ ప్రేక్షకులు మాకొద్దీ అందాలు అంటూ వెనక్కి పంపించేశారు. 

'ముకుందా' సినిమాతో తొలి సినిమాకే మంచి పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్దే కూడా రెండో సినిమాకి బాలీవుడ్‌కి వెళ్లి భంగపడి తిరిగొచ్చిందే. మిల్కీ బ్యూటీ తమన్నా పరిస్థితి కూడా ఇంతే. ఇక లేటెస్టుగా స్మైలీ బ్యూటీ రకుల్‌కీ బాలీవుడ్‌తో భంగపాటే మిగిలింది. ఇక్కడి స్టార్‌డమ్‌ని వదిలేసుకుని ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌కి వెళ్లింది 'అయ్యారీ' సినిమా కోసం. ఓహో ఈ సినిమా గురించి, బాలీవుడ్‌ గురించీ తెగ చెప్పుకొచ్చింది రకుల్‌. చివరికి ఏం జరిగింది ఈ భామని కూడా బాలీవుడ్‌ సేమ్‌ టు సేమ్‌ అలాగే భంగపరిచింది. ఆ కోవలోనే ఇప్పుడు అందాల రెజీనా కూడా బాలీవుడ్‌ బాట పట్టింది. 

'అ' సినిమాలో రెజీనా నటనకు ఫిదా అయిపోయిన దర్శక, నిర్మాతలు, రెజీనాకి పిలిచి ఆఫర్‌ ఇచ్చారు. ఆ ఆఫర్‌ చూసుకుని రెజీనా ఆనందంతో తెగ ఉబ్బితబ్బిబ్బైపోతోంది. అయితే ఈ ఆనందం ఎన్నాళ్లో త్వరలోనే తెలిసిపోతుందిలే. వీళ్లందరి సంగతిలా ఉంచితే, బాలీవుడ్‌కి వెళ్లి స్టార్‌ ఇమేజ్‌ సంపాదించుకున్న వారిలో క్యూట్‌ భామ తాప్పీ ఒక్కతే నిలదొక్కుకుంది. ఈ ముద్దుగుమ్మకి ఒక్కదానికే ఎందుకో అదృష్టం అలా కలిసొచ్చేసిందంతే!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS