తెలుగమ్మాయ్‌ అలా దోచేస్తోంది మరి.!

మరిన్ని వార్తలు

పదహారణాల తెలుగమ్మాయ్‌ రీతూ వర్మ. ఏం లాభం.? ‘పెళ్ళిచూపులు’ లాంటి హిట్టు కొట్టినా, ఆమెని టాలీవుడ్‌ పెద్దగా పట్టించుకోలేదు. దాంతో, కోలీవుడ్‌కి వెళ్ళిపోయిన రీతూ వర్మ, అక్కడ పెద్ద సినిమాలే చేసేసింది. తాజాగా ఆమె నటించిన ఓ సినిమా తెలుగులోకి ‘కనులు కనులను దోచాయంటే’ పేరుతో విడుదలయ్యింది. సినిమా విడుదలయ్యాక, చాలామంది లైట్‌ తీసుకున్నారు. అయితే, అనూహ్యంగా రెండో వారానికి సినిమా పుంజుకుంది. ఈ పుంజుకోవడం కూడా ఆషామాషీగా లేదండోయ్‌. మొదటి వీకెండ్‌తో పోల్చితే, రెండో వీకెండ్‌లో వసూళ్ళు గణనీయంగా పెరిగాయట.

 

ఓ చిన్న సినిమాకి, పైగా డబ్బింగ్‌ సినిమాకి ఇంతకన్నా గొప్ప విజయం ఇంకేముంటుంది.? ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించాడు. దుల్కర్‌ - రీతూ వర్మ మధ్య కెమిస్ట్రీ సినిమాకి బాగా ప్లస్‌ అయ్యింది. ‘కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌’ అని మరోసారి నిరూపితమయ్యిందని ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా టీవ్‌ు చెబుతోంది. రెండో వీకెండ్‌లో చాలా ది¸యేటర్లను అదనంగా జోడించారట.

 

ఈ మధ్యకాలంలో ఇంత సైలెంట్‌గా హిట్టు కొట్టిన డబ్బింగ్‌ సినిమా ఇంకోటి లేదని టాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. దాంతో, రీతూ వర్మని లక్కీ గాళ్‌ అంటున్నారిప్పుడు మన టాలీవుడ్‌ జనం కూడా. అన్నట్టు రీతూ వర్మ, నాని సరసన ‘టక్‌ జగదీష్‌’ సినిమాలో నటిస్తోన్న విషయం విదితమే. నాగ శౌర్యతోనూ ఓ సినిమాకి కమిట్‌ అయ్యింది రీతూ వర్మ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS