శూర్పుణఖ’గా రెజీనా.. నమ్మలేకపోతున్నా.!

మరిన్ని వార్తలు

గ్లామర్‌లో అన్ని ఎత్తులూ , లోతులూ చూసేసిన రెజీనా ప్రస్తుతం ప్రాధాన్యత ఉన్న పాత్రలకు మొగ్గు చూపుతోంది. తన చుట్టూ తిరిగే కథా చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఆ కోవలోనే మొన్న ‘ఎవరు.?’ అన్నది.. ఇప్పుడేమో ‘నేనేనా..?’అంటోంది. ప్రస్తుతం రెజానా నటిస్తున్న చిత్రం ‘నేనే నా.’? ఈ సినిమాలో రెజీనా శూర్పణఖ పాత్ర లో కనిపించనుంది. అంటే నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రనా.? అంటే అవుననే అనుకోవాలి. ఎందుకంటే, శూర్పణఖ అంటే బాధపెట్టేదే కదా. కానీ, రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో రెజీనా బాధపడుతూ కనిపిస్తోంది. ఇనుప ఊచల మధ్య బంధీ అయిన రాకుమారిలా బాధతో కనిపిస్తోంది. కానీ, ఆమె కళ్లు మాత్రం పగతో కనిపిస్తున్నాయి. అంటే, రెజీనా పాత్రలో చాలా వేరియేషన్సే ఉన్నాయనుకోవాలి.

 

‘ఎవరు’ సినిమాలోనూ డిఫరెంట్‌ వేరియేషన్స్‌ చూపించింది రెజీనా. ఆ సినిమాకి రెజీనా నటనకు మంచి పేరు వచ్చింది. అలాగే ఈ సినిమాలోనూ రెజీనా పాత్ర ఆకట్టుకుంటుందని అంటున్నారు. మిస్టరీ థ్ల్రిల్లర్‌ నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘నిను వీడని నీడను నేనే’ అను కన్ఫ్యూజింగ్‌ కాన్సెప్ట్‌ని ఆడియన్స్‌కి అర్ధమయ్యేలా చెప్పిన దర్శకుడు కార్తిక్‌ రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. వెనెల కిషోర్‌ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్నాడు. త్వరలో సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS