Regina, Harish Shankar: హ‌రీష్ శంక‌ర్‌ షాక్‌: రెజీనా ఇచ్చి ప‌డేసిందిగా..!

మరిన్ని వార్తలు

ఈమ‌ధ్య రెజీనా స్పీడు మామూలుగా లేదు. కౌంట‌ర్‌ల‌కు ఎన్‌కౌంటర్లు ఇచ్చేస్తోంది. ప్రెస్ మీట్ల‌లో రెబ‌ల్ గా మాట్లాడుతోంది. ఇంట‌ర్వ్యూల‌లోనూ అంతే. ఇప్పుడు ట్విట్ట‌ర్‌లోనూ త‌న త‌డాఖా చూపించింది. ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌కు షాక్ ఇచ్చింది.

 

హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌`. సాయిధ‌ర‌మ్ తేజ్‌, రెజీనా జంట‌గా న‌టించారు. ఈ సినిమా విడుద‌లై ఏడేళ్ల‌య్యింది. ఈ సంద‌ర్భంగా ఆ జ్ఞాప‌కాల్ని గుర్తు చేసుకుంటూ హ‌రీష్ ట్వీట్ చేశారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ.. ఆ ట్వీట్ లో ఎక్క‌డా రెజీనా ప్ర‌స్తావ‌న లేదు. దాంతో రెజీనా కౌంట‌ర్ ఎటాక్ చేసింది. ఇంగ్లీష్‌లో.. Looks like my #SFS director has no character(s) left to mention the rest of us. @harish2you thank you for inspiring “Sita tho antha easy kadhu.” అంటూ ట్వీట్ చేసింది. దీంట్లో బోలెడ‌న్ని పంచ్‌లు వెదుకుతున్నారు నెటీజ‌న్లు. నో క్యారెక్ట‌ర్ అనేది.. హ‌రీష్ కు వ‌ర్తిస్తుందా? హ‌రీష్ గురించే అలా ట్వీట్ చేసిందా..? అంటూ ఆరాలు తీస్తున్నారు. అంద‌ర్నీ వాడుకొని, ఇప్పుడు పేర్లు మ‌ర్చిపోతావా? అంటూ నేరుగానే రెజీనా ఎటాక్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. సీత‌తోనే కాదు.. రెజీనాతోనూ అంత వీజీ కాదుగా..!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS