పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనే ట్యాగ్ కన్నా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటుంది రేణు దేశాయ్. అది ఆమె మాటల్లో కాని చేతల్లో కాని మనకి కనిపిస్తుంది.
ఇక తాజాగా ఆమె రెండవ వివాహం గురించి మాట్లాడడం, ఆ తరువాత ఒకరిని ఇష్టపడి అతనితో ఈ మధ్యనే నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఈ నేపధ్యంలో ఆమెకి సోషల్ మీడియాలో పవన్ అభిమానులు అని చెప్పుకునే వాళ్ళ దగ్గరి నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఆ వ్యతిరేకత ఎంతలా అయిందంటే ఆమె ఏకంగా సోషల్ మీడియాని విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా ఆమెకి పవన్ కళ్యాణ్ సంబంధించి రాజకీయంగా ఆయనకి మద్దతు తెలపమంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయట.
ఇదే విషయమై స్పందిస్తూ- “నేనెప్పుడూ పవన్ గురించి తప్పుగా మాట్లాడను. అలా మాట్లాడమని నన్ను కానీ నా పిల్లలను కానీ ఏ రాజకీయ పార్టీ ప్రేరేపించలేదు”. ఏదేమైనా పవన్ కి ఉన్న తిక్క అభిమానులతో రేణు దేశాయ్ మాత్రం మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంది అని ఒప్పుకోక తప్పదు.