రేణూదేశాయ్‌కి ఆయనంటే ఎందుకింత కష్టం..!

మరిన్ని వార్తలు

'జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా మనతోనే ఉంటాయి..' అనే డైలాగ్‌ గుర్తుంది కదా. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'తొలిప్రేమ' సినిమాలో వరుణ్‌ తేజ చెప్పిన డైలాగ్‌ ఇది. అవును నిజమే అన్నట్లుగా తన జీవితంలోని జ్ఞాపకాలను తలచుకుంటూ పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య, హీరోయిన్‌ అయిన రేణూ దేశాయ్‌ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో సహజీవనం, పెళ్లి, విడాకులు ఇలా ఆమె జీవితంలో చెరగని జ్ఞాపకాలుగా మిగిలిపోయిన ఘట్టాలు ఇవి. ఎందుకో ఆమెకు తన జీవితంలో ముగిసిపోయిన జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయట. దాంతో ఆ జ్ఞాపకాలకు తన టాలెంట్‌ జోడించి, ఓ విషాద కవితలా మలచింది. ఆ కవిత ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

'ఆయన మాటలు, పదాలు, ఆయన పేరు చెక్కిన కలం ఇవన్నీ నా జ్ఞాపకాల్లో ఉన్నాయి. కానీ కమ్ముకున్న హిమం కరిగిపోయి మళ్లీ ఆ జ్ఞాపకాలు ఇప్పుడు కళ్లెదుట నిలిచాయి. విధి ఎంత బలీయమైంది. మనసు లోతుల్లో దాచుకున్న జ్ఞాపకాల్ని మళ్లీ తట్టి లేపింది. ఈ జ్ఞాపకాల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే తుప్పు పట్టిన కలం, దానిపై చెక్కిన ఆయన పేరు తుడిచి పెట్టుకుపోయాయి. ముక్కలైన నా హృదయం, నేను రాసుకున్న లేఖల కాగితపు ముక్కల్లా కనిపించాయ్‌' అని ఆమెలోని కవి హృదయం ఆవేదనతో ఉప్పొంగింది. 

తెలుగులో చేసినవి రెండే సినిమాలైనా కానీ నటిగా మంచి గుర్తింపు పొందింది. పవన్‌కి మాజీ భార్య అయినా రేణూ దేశాయ్‌ అంటే ఆ అన్నకి భార్య (వదిన)గా పవన్‌ అభిమానుల్లో ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలాంటిది రేణూ దేశాయ్‌ జ్ఞాపకాల పేరుతో ఇప్పుడు ఎందుకింత ఎమోషనల్‌గా ఫీలయ్యిందోనంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS