అమ్మ‌గా న‌టించ‌మ‌న్నారు.. కానీ కుద‌ర్లేదు : రేణూ దేశాయ్‌.

By Gowthami - January 29, 2020 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ మాజీ భార్య‌గా పాపుల‌ర్ అయి, ఈమ‌ధ్య ట్విట్ట‌ర్‌లో త‌న కామెంట్ల‌తో మ‌రింత మంది అభిమానుల్ని సంపాదించుకుంది. న‌టిగా బిజీ అయ్యే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే ఈమ‌ధ్య ఓసినిమాలో అమ్మ‌గా న‌టించే ఆఫ‌ర్ వ‌స్తే... వ‌దులుకుంది. ఆ సినిమానే `చూసీ చూడంగానే`. రాజ్ కందుకూరి త‌న‌యుడు శివ కందుకూరి హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్ర‌మిది. ఈ శుక్ర‌వారం విడుద‌ల అవుతోంది. ఈ సంద‌ర్భంగా మంళ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ ఘ‌నంగా జ‌రిగింది.

 

ఈ కార్య‌క్ర‌మంలో రేణూ కూడా హాజ‌రైంది. త‌న‌కు ఈ సినిమాలో ఓ పాత్ర ఆఫ‌ర్ చేసిన సంగ‌తీ గుర్తు చేసింది. "ఇండస్ట్రీలోకి ఉమెన్ టెక్నీషియన్స్ ఎక్కువమంది రావాలని కోరుకుంటున్నాను. ఏదో ఒకనాటికి మేల్, ఫిమేల్ డైరెక్టర్ అనే భేదం పోయి డైరెక్టర్ అని మాత్రమే మాట్లాడుకోవాలి. ఏ ఫిమేల్ టెక్నీషియన్ అన్న హ్యాపీగా పని చేసుకోగల నైస్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు. ఆయన నాకు ఈ సినిమాలో మదర్ రోల్ ఆఫర్ చేశారు, ఐ లవ్ ద రోల్. కానీ నాకు ఒంట్లో బాగా లేకపోవడం వల్ల చేయలేకపోయాను. నెక్స్ట్ ఫిలింలో అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను. ఈ సినిమా కచ్చితంగా మ్యూజికల్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను" అని చెప్పారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS