ఒకప్పటి హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. నెట్టింట్లో ఆమె నుండి ఏ చిన్న పోస్ట్ వచ్చినా, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తారు. వారి స్పందనకు ప్రతి స్పందన కూడా అలాగే ఇస్తుంటుంది రేణూ దేశాయ్. తన పిల్లలు, ఆధ్య, అకీరాలకు సంబంధించిన ఫోటోలను, ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ కూడా బాగానే రియాక్ట్ అవుతుంటారు. ఒక్కోసారి ఆ రియాక్షన్ వికటిస్తూ, రేణూ దేశాయ్‌ని కోపానికి గురి చేస్తుంటుంది కూడా. ఇప్పుడు కూడా అలాంటి రెస్పాన్సే వచ్చింది. తాజాగా రేణూ దేశాయ్ పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు రేణూ కోపానికి కారణమైంది. అకీరానందన్, తన చెల్లెలు ఆధ్యని ప్రేమగా ఎత్తుకుని ముద్దాడుతున్న ఓ ఫోటోని రేణూ దేశాయ్ పోస్ట్ చేసింది.
ఈ ఫోటోకి ఓ నెటిజన్ ఎంతైనా పవన్ కళ్యాణ్ బ్లడ్ కదా.. అని రిప్లై ఇచ్చాడు. ఆ మాటకి రేణూ దేశాయ్‌కి చాలా కోపం వచ్చేసింది. పవన్ రక్తం ఏంటీ? నా పిల్లలిది నా రక్తమే.. నీకు సైన్స్ తెలీదా.? అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. నిజానికి రేణూ అంతలా రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు. కానీ, ఈ మధ్య రేణూకి చిన్న విషయానికే కోపం కట్టలు తెంచుకొచ్చేస్తోంది. అలాగే ఈ ఇష్యూలో కూడా జరిగింది. దాంతో పాపం సదరు నెటిజన్ రేణూ దేశాయ్ చేతిలో అడ్డంగా బుక్కయిపోయాడంతే.