నటిగా కన్నా కూడా పవన్ కళ్యాణ్ భార్య గానే ప్రశంసలు, గుర్తింపు పొందిన రేణు దేశాయ్ ఆయన నుండి విడిపోయిన తరువాత నుండి మాత్రం విమర్శలనే ఎక్కువుగా ఎదురుకుంటున్నది.
ఈమధ్య కాలంలో ఆమె రెండవ వివాహం చేసుకోవాలి అని అనుకున్న నేపధ్యంలో పవన్ అభిమానులు ఆమె పైన విమర్శలకు దిగడం వాటికి ఆమె అదే స్థాయిలో సమాధానం చెప్పడం జరిగాయి. ఇక తాజాగా పవన్-రేణు సంతానం అయిన అకిరానందన్ విజయవాడ లోని పవన్ కళ్యాణ్ కొత్త ఇంటి గృహప్రవేశం సందర్భంగా కనపడ్డాడు.
దీనితో ఇక అకిరా ఇప్పటినుండి పవన్ కళ్యాణ్ తో నే ఉండబోతున్నాడు అన్న ఒక ప్రచారం మొదలైంది. దీనికి రేణు సమాధానమిస్తూ- కేవలం స్కూల్ కి సెలవలు ఇచ్చిన కారణంగా తన తండ్రితో గడపడానికి మాత్రమే అకిరా విజయవాడ వెళ్ళాడు అని అంతేతప్ప పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండిపోవడానికి కాదు అని స్పష్టం చేసింది.
రేణు దేశాయ్ ఇచ్చిన క్లారిటి తో ఈ అంశానికి తెరపడినట్టయింది.