అడివి శేష్ నటిస్తున్న చిత్రం `మేజర్`. సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి ప్రిన్స్ మహేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకుడు. మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇప్పటి వరకు 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. కరోనా వైరస్ కారణంగా గత కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్‌ని తాత్కాలికంగా ఆపేశారు. లాక్ డౌన్ నిబంధనల్ని సడలించడంతో షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది.
ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం రేణుదేశాయ్ ని ఎంచుకున్నారని సమాచారం. ఇటీవల సినిమాలపై మళ్లీ దృష్టి పెట్టింది రేణూ. పైగా.. అకీరా, అడవిశేష్ ఇద్దరూ బాగా క్లోజ్ ఉంటారని, రేణూ కి శేష్ ఫ్యామిలీ ఫ్రెండ్ గా మారిపోయాడని, ఆ చనువుతోనే ఈ ప్రాజెక్టులోకి రేణూ వచ్చిందని సమాచారం. మరి ఇది నిజమా, కాదా? రేణూ ఈసినిమాలో నటించడానికి ఒప్పుకుందా, లేదా? అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.