నాగార్జున వెనక్కి తగ్గాడా?

By iQlikMovies - June 27, 2018 - 12:41 PM IST

మరిన్ని వార్తలు

అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా మంచి విజయం అందుకుంది. కళ్యాణ్‌ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. డైరెక్టర్‌గా కళ్యాణ్‌కృష్ణకు, నాగార్జునకు మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు, బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించిందీ సినిమా. ఈ సినిమాలో నాగార్జున పోషించిన పాత్ర పేరు 'బంగార్రాజు'. 

ఇదే టైటిల్‌తో 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకి సీక్వెల్‌ తెరకెక్కించాలని ఆ సినిమా టైంలోనే నాగార్జున - కళ్యాణ్‌కృష్ణ ఓ డీల్‌ కుదుర్చుకున్నారు. రేపో మాపో ఈ సీక్వెల్‌ పట్టాలెక్కబోతోందనే అభిమానులు ఆశించారు. అయితే, 'నేల టికెట్‌' ఫెయిల్యూర్‌తో కళ్యాణ్‌కృష్ణపై నమ్మకం పెట్టలేకపోతున్నాడట నాగార్జున. దాంతో ఈ సీక్వెల్‌ దాదాపు అటకెక్కేసినట్లే అంటున్నారు. అయితే కళ్యాణ్‌కృష్ణ మాత్రం ఈ సబ్జెక్ట్‌పై చాలా నమ్మకంతో ఉన్నాడు. ఒకవేళ నాగార్జున కాదంటే ఇంకో హీరోతోనైనా ఆ సినిమా చేయాలనుకుంటున్నాడట. 

'నేల టికెట్‌' ఆశించిన రిజల్ట్‌ అందుకోకపోవడంతో, ఎలాగైనా ఈ సినిమాతో హిట్‌ కొట్టి తానేంటో ప్రూవ్‌ చేసుకోవాలనే కసితో కళ్యాణ్‌కృష్ణ ఉన్నాడనీ తెలుస్తోంది. అయితే 'బంగార్రాజు' పాత్రలో అభిమానుల్లో ప్రత్యేకమైన ముద్ర వేశాడు నాగార్జున. ఆ పాత్రలో నాగార్జునను తప్ప మరో హీరోని ఊహించుకోవడం కష్టమే. అది కూడా నాగ్‌ కాదంటే ఓ యంగ్‌ హీరో తన మదిలో మెదులుతున్నాడనీ కళ్యాణ్‌కృష్ణ చెబుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. 

చూడాలి మరి, ఈ సీక్వెల్‌లో నాగార్జునే నటిస్తాడా.? లేక ఇంకెవరు నటిస్తారో.?

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS