రామ్ గోపాల్ వర్మ అంటే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. తన ఫీలింగ్ ఏదైనా నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు. ఈ మధ్య ఆయన సినిమాల కన్నా ట్వీట్స్ ద్వారానే ఎక్కువ పాపులర్ అవుతున్నాడు. ఈ మధ్య తన కూతురు రేవతి జిమ్ చేస్తున్న వీడియో ఒకటి ఆయనకు పర్సనల్ గా పంపిందంట. ఇంకేముంది, ఆయన అది కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
"నా కూతురు నన్ను కొట్టేందుకు తనంతట తానే ట్రైనింగ్ అవుతుంది" అంటూ కామెంట్ కూడా జతచేసాడు. ఈ పోస్ట్ చూసిన రేవతి తన తండ్రి పై పిచ్చి, పిచ్చిగా కోపం వచ్చేసిందట. నేను నీకు పర్సనల్ గా వీడియో ను పంపాను, అది నువ్వు సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేసావ్..? వెంటనే దాన్ని డిలీట్ చేసేయ్, లేదంటే అమెరికా నుండి వచ్చి నిజంగానే నిన్ను కొడతా, అంటూ మెసేజ్ చేసింది.
ఇది కూడా ఆర్జీవీ వెంటనే "నా కూతురు నాకు పెట్టిన మెసేజ్" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, సంచలనాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు.