తెలుగు సినీ పరిశ్రమను వర్మ ప్రశ్నిస్తూ ఓ లేఖ విడుదల చేశారు సోషల్ మీడియా ద్వారా. రామ్‌గోపాల్ వర్మ అంటేనే సంచలనాలకు కేంద్ర బిందువు. డ్రగ్స్ కేసులో తెలుగు సినీ పరిశ్రమపై ఆరోపణలు వచ్చినప్పుడు, మీడియాలో ఆయా వ్యక్తులపై జరుగుతున్న ప్రచారం పట్ల వర్మ ఆవేదనకు గురయ్యాడు, ప్రశ్నించాడు కూడా. విచారణ జరుగుతున్న తీరుపై వర్మ అభ్యంతరాలు వ్యక్తం చేయడం కూడా జరిగింది. తాజాగా వర్మ విడుదల చేసిన లేఖలో, తెలుగు సినీ పరిశ్రమ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పడాన్ని వర్మ ప్రశ్నించి అందర్నీ షాక్‌కి గురిచేశారు. విచారణలో నిందితులనిగానీ దోషులనిగానీ తేలనప్పుడు వారి తరఫున ప్రభుత్వానికి క్షమాపణ చెప్పడమేంటన్నది వర్మ ప్రశ్న. ఇలా ప్రశ్నించడానికి ఎంతో ధైర్యం కావాలి. డేరింగ్ అండ్ డాషింగ్ అంటే వర్మ తర్వాతే ఎవరైనా. ప్రశ్నించదలచుకున్న విషయం పట్ల పూర్తి అవగాణ ఉంటేనే ఆయన ప్రశ్నిస్తారు. విచారణ జరుగుతున్న సమయంలో ఎవరైనా ఒకింత వేచి చూడాల్సి ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి 12 మంది డ్రగ్స్ కేసులో విచారణఖు హాజరయ్యారు. వారు సాక్షలు మాత్రమేనని 'సిట్' బృందం కూడా పేర్కొంది. కాబట్టి 'కొంతమంది చేసిన పనికి' అని తెలుగు సినీ పరిశ్రమ తరఫున 'క్షమాపణ' ప్రభుత్వానికి వెళ్ళడం సబబు కాదు. అలా పేర్కొనడం ద్వారా తెలుగు సినీ పరిశ్రమే కొందర్ని దోషులుగా చిత్రీకరించినట్లయ్యింది. వర్మ లేఖాస్త్రం పట్ల తెలుగు సినీ పరిశ్రమ పెద్దలేమంటారో చూడాలిక.