ప్రకాష్ రాజ్-రోజాల పాత్రల పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ!

మరిన్ని వార్తలు

ప్రకాష్ రాజ్ ఎన్టీఆర్ పాత్రలో రోజా లక్ష్మి పార్వతి పాత్రలో ఆర్జీవీ లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రంలో నటించనున్నారు అన్న వార్తలు నిన్నటినుండి సంచలనం సృష్టిస్తున్నాయి.

అయితే ఈ వార్తల పై దర్శకుడు ఆర్జీవీ స్పష్టం చేశాడు. ఇప్పటివరకైతే సినిమాలో ఎవరు ఏ పాత్రలో నటిస్తారు అన్న అంశంపైన చర్చ జరగలేదు అని  అలాగే ప్రకాష్ రాజ్, రోజా ఈ చిత్రంలో నటిస్తున్నారు అన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు అని క్లారిటీ ఇచ్చేశాడు.

దీనితో నిన్నటినుండి ఈ అంశం పై కొనసాగుతున్న సస్పెన్స్ కి తెరపడింది అనే చెప్పాలి. ఇదిలావుండగా లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వచ్చే సంవత్సరం మొదట్లో మొదలుపెట్టి అదే సంవత్సరం చివరలో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

ప్రకటించిన మొదటిరోజూనే ఇంతటి కాంట్రవర్సి మూటకట్టుకున్న ఈ చిత్రం ఇకపై ఇంకెన్నటికీ ఆజ్యం పోయనుందో..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS