సంచలనాల దర్శకుడు ఆర్జీవీ నుండి మరొక సంచలనాత్మక ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన సారంశామేమిటంటే- త్వరలోనే అఖిల్ తో ఒక సినిమాని తీయబోతున్నట్టు తెలిపాడు. ఈ చిత్రాన్ని నాగార్జున తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించనున్నాడు.
ఇప్పటికే ఆయన నాగార్జున తో చాలా గ్యాప్ తరువాత ‘ఆఫీసర్’ చిత్రాన్ని తెరకెక్కించాడు అది త్వరలోనే విడుదలకి సిద్ధమవుతున్నది. అయితే ఈ ఆఫీసర్ చిత్రాన్ని ఆర్జీవీ నిర్మిస్తున్నాడు. ఇక అఖిల్-వర్మ చిత్రానికి సంబందించిన వార్తలు గత కొద్దికాలంగా చక్కర్లుకోడుతునే ఉన్నాయి, ఈ తరుణంలో ఆర్జీవీ నుండి ఈ ప్రకటన రావడంతో ప్రేక్షకుల్లో క్లారిటీ వచ్చేసింది.
ఇక ఇప్పుడు ఆర్జీవీ ఈ అక్కినేని ప్రిన్స్ కి సరైన హిట్ ఇస్తాడా లేక మరింతలా కుంగిపోయే ఫ్లాప్ ఇస్తాడా అన్న చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. ఎందుకంటే వర్మ గత కొన్నిరోజులుగా తన మార్క్ సినిమా ని ప్రేక్షకులకి ఇవ్వలేకపోతున్నాడు, అందుకే ఈ సినిమా పైన ఎక్కువమందికి అంచనాల కన్నా అనుమానాలు ఉన్నాయి.
ఏమో చెప్పలేం.. వర్మ ఏదైనా చేయగలడు.. అఖిల్ కి సరైన హిట్ వర్మ మాత్రమే ఇవ్వగలడు అని అనేవారు కూడా లేకపోలేదు.