దటీజ్‌ రామ్‌గోపాల్‌ వర్మ.!

మరిన్ని వార్తలు

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సినిమాలు తీసినా తీయకపోయినా ఆయన పేరు ఎప్పుడూ మార్మోగుతూనే ఉంటుంది. సినీ పరిశ్రమలో ఆయనకు చాలా మంది శిష్యులున్నారు. ఆయన దగ్గర పని చేసినవారు, ఆయన స్పూర్తితో సినిమా రంగంలోకి వచ్చినవారు లెక్కలేనంత మంది ఉన్నారు. 

తన శిష్యులు సక్సెస్‌ అవుతుంటే ఆ సక్సెస్‌ని తన సక్సెస్‌గా ఎంజాయ్‌ చేస్తుంటారు వర్మ. ఏ గురువుకైనా శిష్యుల సక్సెస్‌ కన్నా మించిన ఆనందం ఇంకేముంటుంది. 'ఆర్‌ఎక్స్‌ 100' సూపర్‌ హిట్‌ అయ్యింది. ఆ సినిమా డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడే. వర్మ ఈ సినిమాని ప్రమోట్‌ చేసిన తీరు అద్భుతం. 

తాజాగా వర్మ తన శిష్యుడి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఆ సినిమా టైటిల్‌ 'భైరవ గీత'. ఆర్జీవీ నిర్మించిన చిత్రమిది. సిద్ధార్ధ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు వర్మ ఈ సినిమాతో. ధనుంజయ, ఇరా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రోజే ట్రైలర్‌ విడుదలవుతోంది. 

'ఆర్‌ఎక్స్‌ 100' తరహాలోనే ఇదొక 'రా' లవ్‌ స్టోరీ. భీభత్సమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అంతకుమించి భావోద్వేగ సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయట. రామ్‌గోపాల్‌ వర్మకు చెందిన 'కంపెనీ', అభిషేక్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS