టాక్ అఫ్ ది వీక్ – సవ్యసాచి

మరిన్ని వార్తలు

యువసామ్రాట్ అక్కినేని నాగార్జున దాదాపు రెండు నెలల వ్యవధిలో రెండు సినిమాలని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చాడు. అయితే ఇది కావాలని చేసింది కాదు, ఆయన తాజా చిత్రం సవ్యసాచి రీ-షుట్ల భారినపడడంతో ఇలా అనుకోని సమయంలో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

 

ఇక మొన్న విడుదలైన ఈ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, కాన్సెప్ట్ కాస్త వైవిధ్యంగా ఉండడంతో ఈ సినిమా పైన ప్రేక్షకులకి ముందునుండి ఒక స్థాయి మంచి అభిప్రాయమే ఉండింది. అయితే ప్రేక్షకులు ధియేటర్ కి వెళ్ళిన తరువాత మాత్రం తీవ్ర నిరుత్సానికి గురయ్యారు. కారణం చెప్పాలనుకున్న పాయింట్ బలంగా ఉన్నప్పటికీ అది ప్రేక్షకులు మెచ్చే విధంగా చెప్పలేకపోవడమే అని తెలుస్తుంది.

 

సవ్యసాచి కోసం మాధవన్ వంటి నటుడిని తెలుగులోకి తీసుకువచ్చినా ఆయన నుండి దర్శకుడు రాబట్టుకున్న నటన అంతపెద్దగా ఏమి లేదు అన్నది ప్రేక్షకుల భావన. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి నుండి వచ్చిన బాణీలు ముఖ్యంగా నిన్ను రోడ్డు మీద పాట ప్రేక్షకులని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి.

ఏదేమైనా.. చైతుకి ఈ సంవత్సరం వచ్చిన రెండు చిత్రాలు ఆయన ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడం ఆయనకీ & ఆయన అభిమానులకి నిరాశ కలిగించే అంశమే.

ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS