ప‌వ‌న్‌ని వీర లెవిల్లో పొగిడేసిన వ‌ర్మ‌

మరిన్ని వార్తలు

వ‌ర్మ దృష్టి ఎప్పుడు ఎవ‌రిపై ప‌డుతుందో, ఎవ‌రిని తిడ‌తాడో, ఎవ‌రిని పొగుడుతాడో.... అస‌లు అది తిట్టో పొగ‌డ్తో - ఏదీ అర్థం కాదు. ప‌వ‌న్ పేరెత్త‌గానే వ‌ర్మ పేట్రేగిపోతుంటాడు. ఆకాశానికి ఎత్తేస్తుంటాడు. అయితే అందులో వ్యంగం ఎంతో నిజ‌మెంతో అటు అభిమానులకూ, ఇటు వ‌ర్మ ఫాలోవ‌ర్స్‌కీ ఏమాత్రం అర్థం కాదు.

 

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అల‌వాటు కొద్దీ ప‌వ‌న్‌ని తెగ పొగిడేశాడు. యునిక్‌.. ఓన్లీ వ‌న్ పీస్ - అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న కంటికి బెస్ట్ సీ.ఎం. ఎవ‌రూక‌నిపించ‌లేద‌ని, ఆ స్థానంలో ప‌వ‌న్‌ని చూడాల‌నుకుంటున్నాన‌ని, ప‌వ‌న్‌త‌ప్ప‌కుండా సీఎం అవుతాడ‌ని చెప్పుకొచ్చాడు వ‌ర్మ‌. చిరంజీవిని తాను కేవ‌లం హీరోగానే అభిమానిస్తాన‌ని, రాజ‌కీయ‌నాయ‌కుడిగా కాద‌ని, ప‌వ‌న్ మాత్రం అలా కాద‌ని, హీరోగా - పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా తాను ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పుకొచ్చాడు. మ‌రి ఈ కామెంట్ల‌ని ఎలా అర్థం చేసుకోవాలో..??


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS