GSTకి సంబంధించి ఆర్జీవీకి కోర్టు నోటిసులు

మరిన్ని వార్తలు

ఆర్జీవీ GST రేపు విడుదల కానున్న తరుణంలో ఆయనకీ ఒక చిన్నపాటి షాక్ తగిలింది అనే చెప్పాలి. 

ఆ వివరాల్లోకి వెళితే, ఆర్జీవీ తీసిన GST కాన్సెప్ట్ తనది అంటూ జయ కుమార్ అనే రచయత వార్తల్లోకి ఎక్కిన సంగతి విదితమే. ఈ తరుణంలో దానికి సంబంధించి ఆర్జీవీ కోర్టు ద్వారా నోటిసులు పంపినట్టు ఆయన తెలిపారు. 

ఇక ఇప్పటికే ఈ విషయం పైన తాను స్పందించను అని ఆర్జీవీ చెప్పగా అలాగే ఆ రచయతని జోకర్ గా అభివర్ణించాడు. మరి ఇప్పుడు ఈ నోటిసుల పైన ఆయన ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇదిలావుండగా GST రేపు ఉదయం 9గంటలకు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది.   

మొత్తానికి ఆర్జీవీ ఈ వీడియో తో పెనుసంచలనం రేపనున్నాడు అన్నది నిర్వివాదాంశం. అయితే ఈ వీడియో చూడాలంటే డబ్బు చెల్లించాలి అని తెలిసి కొందరు డీలా పడ్డట్టు తెలిసింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS