వర్మ అడిగితే నేనొద్దంటానా.!

By iQlikMovies - March 29, 2018 - 16:27 PM IST

మరిన్ని వార్తలు

రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా ఏం మాట్లాడినా ఏం ట్వీటేసినా సెన్సేషనే. అందుకే ఆర్‌జీవీ ట్వీట్స్‌కి అంత పాపులారిటీ. ఈ సంగతి ఇప్పుడు చిన్న పిల్లాడిని అడిగినా ఇట్టే తెలిసిపోతుంది. రామ్‌గోపాల్‌ వర్మ కన్నేశాడంటే ఆ భామ తన సినిమాలో హీరోయిన్‌ అంతే. అలాగే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో ఎక్కడో ఓ మూల చిన్న పాత్రలో కనిపించిన తేజస్విని పట్టుకొచ్చి హీరోయిన్‌గా 'ఐస్‌క్రీమ్‌' అనే టైటిల్‌ పెట్టి సినిమా తీసేశాడు. అలా వర్మ ఖాతాలో చాలా మంది ముద్దుగుమ్మలే ఉన్నారు. 

అలా తాజాగా రామ్‌గోపాల్‌ వర్మ దృష్టిలో ఓ ముద్దుగుమ్మ పడింది. కన్నడ బ్యూటీ. 'తగరు' అనే కన్నడ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. పేరు మాన్వితా హరీష్‌. ఆ సినిమాని రామ్‌గోపాల్‌ వర్మ చూశాడట. ఆ సినిమాలో అమ్మడి నటనకు వర్మ ఇంప్రెస్‌ అయిపోయాడట. దాంతో తనను హీరోయిన్‌గా పెట్టి ఓ సినిమా చేస్తానని వర్మ చెప్పాడట. అంతేనా, ఎంత రెమ్యునరేషన్‌ అడిగినా తనకేం ఇబ్బంది లేదన్నాడట. ఆమె అడిగిన దానికన్నా ఓ పదిలక్షలు ఎక్కువే ఇస్తానని వర్మ చెప్పాడట. దాంతో మాన్వితా హరీష్‌ కూడా ఇంప్రెస్‌ అయిపోయిందట. 

వర్మలాంటి డైరెక్టర్‌తో పని చేయడం తన అదృష్టం. వర్మ అడిగితే కాదనకుండా ఉండగలనా? అని ఈ భామ స్పందించింది. అంతేకాదు, రెమ్యునరేషన్‌తో కూడా పనిలేదని చెప్పిందట. అలా వర్మ ఖాతాలో ఓ కొత్త హీరోయిన్‌ చేరిపోయిందన్న మాట. నాగార్జునతో వర్మ తెరకెక్కిస్తున్న 'ఆఫీసర్‌' సినిమా కోసం మిరా సరీన్‌ అనే కొత్త భామని టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS