తారక్‌ ఇచ్చే కిక్‌ మామూలుగా లేదండోయ్‌.!

By iQlikMovies - March 29, 2018 - 16:17 PM IST

మరిన్ని వార్తలు

'జై లవకుశ' టైంలో ఓ పక్క సినిమా ముచ్చట్లు, మరో పక్క బుల్లితెరపై 'బిగ్‌బాస్‌' ముచ్చట్లతో అబ్బో తెగ సందడి చేసేశాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. అయితే 'జై లవకుశ' ఆశించిన విజయం అందుకోకపోయినా, బుల్లితెరపై 'బిగ్‌బాస్‌' రియాల్టీ షో మాత్రం మాస్త్‌ కిక్‌ ఇచ్చేసింది. అప్పటిదాకా ఉన్న టీఆర్‌పీ రేట్లను ఈ షోలోని తన పర్‌ఫామెన్స్‌తో అమాంతం ఓ రేంజ్‌కి తీసుకెళ్లిపోయాడు తారక్‌. 

అలాగే ఇప్పుడు మరో సారి కిక్‌ ఇచ్చేందుకు తారక్‌ ముస్తాబయిపోతున్నాడంటే అవునంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఓ పక్క ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాలో పూజా హెగ్దేతో ఎన్టీఆర్‌ ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌కి రెడీ అవుతున్నాడు. మరో పక్క రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో కలిసి ఎన్టీఆర్‌ బాక్సర్‌గా కనువిందు చేయనున్నాడు. బిగ్‌ స్క్రీన్‌ సంగతిటుంచితే, బుల్లి స్క్రీన్‌పై కూడా ఎన్టీఆర్‌ సందడి మొదలెట్టనున్నాడట. క్రికెట్‌ అభిమానులు ఆశక్తిగా ఎదురు చూసే ఐపీఎల్‌ 2018కి ఎన్టీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.  

ఏప్రిల్‌ 7 నుండి ఐపీఎల్‌ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ ఛానెల్‌ ప్రసారం చేయనున్న ఐపీఎల్‌ తెలుగు ప్రసారాలకు సంబంధించి ఎన్టీఆర్‌ ప్రోమో షూట్‌లో పాల్గొన్నాడంటూ కొన్ని ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. అయితే ఇంతకీ అవి ఐపీఎల్‌ ప్రచారానికి సంబంధించినవా? కావా? అనే విషయంలో పక్కా క్లారిటీ లేదు కానీ, ఏది ఏమైనా ఓ పక్క వరుస సినిమాలతోనూ, మరో పక్క ఇదిగో ఇలా ఐపీఎల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటూ ఎన్టీఆర్‌ హాట్‌ హాట్‌గా వార్తల్లో నిలుస్తున్నాడు. 

ఎన్టీఆర్‌ అభిమానులకు ఇది కిక్‌ ఇచ్చే విషయం కాక మరింకేంటి చెప్పండి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS