అర్జీవీ అంటేనే ఏదొక సంచలనం చేస్తాడు అన్న అర్ధంవచ్చేలా తన ప్రవర్తనతో మార్చేసుకున్నాడు.
ఇదే పంథాలో తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఒక చిత్రాన్ని దసరాకి ప్రారంభించి జనవరి ఆఖరికల్లా విడుదల చేస్తాను అంటూ ప్రకటించడం ఇప్పుడు వివాదాస్పదమవుతున్నది.
ఇదిలావుండగా నిన్న సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలికలతో ఉన్న ఒక వ్యక్తి వీడియో వైరల్ గా మారింది. వెంటనే ఈ వీడియో చూసి, సదరు వ్యక్తి ఆచూకి తెలిపిన వారికి రూ 1 లక్ష ఇస్తాను అంటూ ప్రకటించడం సంచలనం సృష్టించింది.
అయితే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో పనిచేసే వ్యక్తి సదరు వీడియో లో ఉన్న ఆ వ్యక్తి గురించిన వివరాలు అందించాడని ఆర్జీవీ ప్రకటించాడు. ఈ విషయం చెప్పడమే కాకుండా తాను మాట ఇచ్చిన ప్రకారం రూ 1 లక్ష ఇవ్వబోతున్నట్టుగా చెప్పి హల్చల్ సృష్టిస్తున్నాడు.
ఏదేమైనా.. అర్జీవీ తనకి వచ్చిన ఇమేజ్ ని తాను చేసే పనులతో పదిలంగా కాపాడుకుంటున్నాడు అనే చెప్పాలి.