'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'లో చంద్రబాబు ఇతడేనా!

By iQlikMovies - October 13, 2018 - 18:21 PM IST

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియాలో ఓ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు వుంటారన్నది వెనకటికి పెద్దలు చెప్పిన మాట. 

అచ్చం చంద్రబాబులానే ఇంకో వ్యక్తి వున్నారంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఓ వీడియో, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దృష్టిలో పడింది. అంతే, ఆ వ్యక్తి సమాచారం ఎవరైనా ఇవ్వగలిగితే వారికి లక్ష రూపాయల బహుమతి అందిస్తానంటూ వర్మ ప్రకటించేశారు. రామ్‌గోపాల్‌ వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాని ఈ నెల 18న ప్రారంభించబోతున్న సంగతి తెల్సిందే. 

అందులో చంద్రబాబు పాత్ర కోసం, చంద్రబాబు పోలిన వ్యక్తి.. అదీ ఈ వీడియోలోని వ్యక్తి అయితే బావుంటుందని రామ్‌గోపాల్‌ వర్మకి ఆలోచన కలగడంలో తప్పేముంది? వీరప్పన్‌ మీద సినిమా తీస్తే, అచ్చం వీరప్పన్‌లా వుండే వ్యక్తిని తీసుకొచ్చాడు వర్మ. 'రక్తచరిత్ర' సినిమా విషయంలో నటీనటుల్ని ఎలా వర్మ ఆయా పాత్రల్లో జీవింపజేశారో చూశాం. 'వంగవీటి' సినిమా విషయంలోనూ అదే జరిగింది. 

ఈ నేపథ్యంలో 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాలో చంద్రబాబు పాత్ర, సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న వీడియోలోని చంద్రబాబు లాంటి వ్యక్తే పోషిస్తే.. అది ఓ సంచలనం కాకుండా ఎలా ఉంటుంది? స్టార్లతో సినిమాలు చేయడమే కాదు, అనామకుల్ని తీసుకొచ్చి స్టార్లను చేయడం వర్మకి వెన్నతో పెట్టిన విద్య. మీకుగాని, ఈ సోషల్‌ మీడియా చంద్రబాబు దొరికితే, వర్మగారికి సమాచారమిచ్చేయండి. ఎంచక్కా, లక్ష రూపాయల బహుమతిని ఎగరేసుకుపోండి. 

అయితే, ఇక్కడో చిన్న ఝలక్‌ వుంది. అదేంటంటే, అసలు ఆ వీడియో నిజమైనదేనా? మార్ఫింగా? కాస్త క్లారిటీ తెచ్చుకోండి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS