బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు ఎంత వైవిధ్యంగా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టాడో అంతే వైవిధ్యంగా తన ప్రవర్తన ఉంటుంది. గతంలో హుద్ హూద్ తుఫాను సమయంలో విరాళం అందివ్వడం ఆ తరువాత ప్రత్యేక హోదా కోసం నిరసన తెలుపుతూ అరెస్ట్ అవ్వడం చర్చనీయంశంగా మారింది.
ఇక తాజాగా తిత్లి తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోయింది. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం సహాయచర్యలు చేపడుతున్నది, ఈ సందర్భంగా సంపూర్నేష్ బాబు తనవంతుగా రూ 50 వేలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ప్రకటించారు.
ఈ సంఘటనకి సంబంధించి స్పందించిన తొలి హీరో అదే విధంగా విరాళం ప్రకటించిన వ్యక్తి కూడా సంపూర్నేష్ బాబే కావడం విశేషం. ఆయన స్పందించిన తీరుని సోషల్ మీడియా వేదికగా అందరూ మెచ్చుకుంటున్నారు.
ఏదేమైనా.. సంపూర్నేష్ బాబు చేసిన పని ఎందరికో ఆదర్శప్రాయం...