వర్మ స్ట్రాటజీ కొత్తగా ఉంటుంది. పబ్లిసిటీ పిండేయడానికి ఏమైనా చేసేస్తుంటాడు. చిరంజీవి, బాలయ్య, పవన్... వీళ్లని వర్మ ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తుంటాడు. ప్రతీ సినిమాలోనూ ఏదోలా వాడుకోవాలని చూస్తుంటాడు. అయితే.. ఈసారి వర్మ రెండు అడుగులు ముందుకేసి, తన పబ్లిసిటీ స్టంట్ లో రజనీకాంత్, కేసీఆర్‌లను కూడా రంగంలోకి దించేశాడు.
వర్మ నుంచి వస్తున్న మరో సినిమా `వర్మ మిస్సింగ్`. రాంగోపాల్ వర్మ కనిపించకుండా పోవడం, ఆ కేసు పవన్, చిరు, బాలయ్య, చంద్రబాబులపై పడడడం ఈ కథ సారాంశం. పాయింటే చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది కదా. ఈ కేసుని డీల్ చేయడానికి రజనీకాంత్ వస్తే ఇంకెంత ఆసక్తికరంగా మారుతుంది..? వర్మ అదే చేశాడు. ఈ కేసులో రజనీని ఇన్‌వాల్వ్ చేశాడు. కేసీఆర్, కేటీఆర్‌లను పోలిన పాత్రలు సైతం ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. మొత్తానికి వర్మ ఈసారి మరింత పెద్ద స్కెచ్ వేసినట్టు అర్థం అవుతోంది. ఇందులో చిరు, పవన్, బాలయ్యపై బోలెడన్ని సెరైర్లు పడ్డాయి. ఈ సినిమా కూడా ఓటీటీ కోసమే అయ్యుంటుంది. ఈసారి వర్మ ట్రిక్కులకు ఎన్ని టికెట్లు తెగుతాయో మరి.