వర్మ స్టైలే వేరు. ఎవరికీ రాని వింత వింత ఐడియాలన్నీ వర్మకే వస్తుంటాయి. బయోపిక్‌ల స్పెషలిస్టుగా ముద్ర వేసుకున్న వర్మపై `పరాన్నజీవి` అనే ఓ సినిమా వచ్చేసింది. మరో రెండు మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. `నా కథ ఎవరెవరో తీయడం ఎందుకు` అని వర్మ అనుకున్నాడో ఏమో.. `నా బయోపిక్ నేనే తీసుకుంటా` అని డిసైడ్ అయిపోయాడు వర్మ. అవును.. వర్మపై వర్మనే ఓ సినిమా తీసుకుంటున్నాడు. టైటిల్ కూడా `వర్మ మిస్సింగ్` అంటూ డిసైడ్ అయ్యాడట.
ఈమధ్య వర్మపై ప్రత్యర్థులు వేస్తున్న వ్యంగ్యాస్త్రాలకు సమాధానంగా ఈ సినిమా ఉంటుందని టాక్. మరి వర్మ గా వర్మనే నటిస్తాడా? మరొకరికి ఛాన్స్ ఇస్తాడా అనేది చూడాలి. వర్మలో నటుడున్నాడన్న సంగతి ఈమధ్య తీసిన `పవర్ స్టార్` తో జనాలకు అర్థమైంది. అందులో తన ఇష్టం వచ్చినట్టు నటించేశాడు వర్మ. ఈసారీ తన పాత్ర తనే చేసే అవకాశాలున్నాయి. ఇలా తనపై తనే ఓ సినిమా తీసుకుంటూ, అందులో తనే హీరోగా నటించిన ఛాన్స్.. వర్మకే వస్తుంది. ఇదీ.. ఓ రికార్డేనేమో.